GodFather Collections : వంద కోట్ల పోస్టర్.. నెట్టింట్లో రామ్ చరణ్, చిరుపై ట్రోలింగ్

మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ స్టామినా గురించి చెప్పాల్సిన పని లేదు. ఒకప్పుడు అయితే చిరంజీవి సినిమా అంటే చాలు కలెక్షన్లు మోత మోగేవి. సినిమా హిట్టు ఫ్లాపులతో సంబంధం ఉండేది కాదు. కానీ మారిన ప్రస్థుత పరిస్థితుల్లో మాత్రం చిరంజీవి సినిమాను సైతం జనాలు పక్కన పెట్టేస్తున్నాడు. సినిమా బాలేదని తెలిస్తే.. ఫస్ట్ డేనే థియేటర్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఆచార్య విషయంలో ఇదే జరిగింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 10, 2022, 09:38 AM IST
  • దూసుకుపోతోన్న చిరంజీవి గాడ్ ఫాదర్
  • వంద కోట్ల క్లబ్బులో మెగాస్టార్ గాడ్ ఫాదర్
  • కలెక్షన్ల విషయంలో భిన్నాభిప్రాయాలు
GodFather Collections : వంద కోట్ల పోస్టర్.. నెట్టింట్లో రామ్ చరణ్, చిరుపై ట్రోలింగ్

GodFather Collections : మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ స్టామినా గురించి చెప్పాల్సిన పని లేదు. ఒకప్పుడు అయితే చిరంజీవి సినిమా అంటే చాలు కలెక్షన్లు మోత మోగేవి. సినిమా హిట్టు ఫ్లాపులతో సంబంధం ఉండేది కాదు. కానీ మారిన ప్రస్థుత పరిస్థితుల్లో మాత్రం చిరంజీవి సినిమాను సైతం జనాలు పక్కన పెట్టేస్తున్నాడు. సినిమా బాలేదని తెలిస్తే.. ఫస్ట్ డేనే థియేటర్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఆచార్య విషయంలో ఇదే జరిగింది.

ఆచార్య దెబ్బతో చిరంజీవి స్టామినా మీద అందరికీ అనుమానం వచ్చింది. చిరంజీవితో పాటుగా రామ్ చరణ్ ఉన్నా, కొరటాల శివ వంటి డైరెక్టర్ ఉన్నా కూడా ఆచార్య పరిస్థితి దారుణంగా మారింది. దీంతో చిరంజీవి మార్కెట్ క్లోజ్ అని అంతా భావించారు. అయితే గాడ్ ఫాదర్ సినిమా కూడా అలానే అవుతుందని అంతా అనుకున్నారు. కానీ గాడ్ ఫాదర్ సినిమాకు కాస్త పాజిటివ్ టాక్ వచ్చింది.

రొటీన్‌కు కాస్త భిన్నంగా చిరంజీవి ట్రై చేశాడు. దీంతో థియేటర్లు కళకళలాడుతున్నాయి. కలెక్షన్లు బాగానే వస్తున్నాయి. అయితే ఈ కలెక్షన్ల పోస్టర్లకు వ్యతిరేకంగా ఉండాలని, తన సినిమాలకు కలెక్షన్ల పోస్టర్లు వేయనని రంగస్థలం ఈవెంట్లో రామ్ చరణ్ మాటిచ్చాడు. కానీ ఇప్పుడు గాడ్ ఫాదర్ కలెక్షన్ల విషయంలో కొణిదెల ప్రొడక్షన్స్ దారుణంగా అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తోన్నట్టుకనిపిస్తోంది.

 

ఈ వారంలో గాడ్ ఫాదర్ బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే పోస్టర్ల మీదున్న కలెక్షన్లలో ఎంత నిజం ఉంది? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వంద కోట్ల క్లబ్బులోకి చేరిందంటూ విడుదల చేసిన గాడ్ ఫాదర్ పోస్టర్ మీద జనాలు ట్రోల్స్ చేస్తున్నారు. మరి నిజంగానే వంద కోట్ల క్లబ్బులో గాడ్ ఫాదర్ చేరిందా? లేదా? అన్నది నిర్మాతలకే తెలియాలి. కానీ వీటిని చూసి ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యపోతోన్నట్టు కనిపిస్తోంది. ఇక యాంటీ ఫ్యాన్స్ మాత్రం గాడ్ ఫాదర్ కలెక్షన్ల మీద మీమ్స్, ట్రోల్స్ వేస్తున్నారు.

Also Read : Nayanthara twin boys: కవల పిల్లలకు తల్లితండ్రులైన నయనతార-విగ్నేష్ శివన్.. పెళ్లైన నాలుగు నెలలకే!

Also Read : Dil Raju Temple: సొంత ఊరిలో దిల్ రాజు వెంకటేశ్వర స్వామి నిర్మాణం.. అద్భుతంగా ఉందంటూ కామెంట్స్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News