Prabhas Maruti Movie: ఇటీవలే 'రాధేశ్యామ్' చిత్రంతో అలరించిన ప్రభాస్.. ఇప్పుడు వరుస చిత్రాల షూటింగ్ తో బిజీగా ఉన్నాయి. ఆయన నటించిన 'ఆదిపురుష్' చిత్ర షూటింగ్ ఇప్పటికే పూర్తికాగ.. 'సలార్', 'ప్రాజెక్ట్-కే' చిత్రీకరణ దశలో ఉన్నాయి. అయితే 'సాహో' చిత్రం విడుదలైన రెండున్నరేళ్ల తర్వాత 'రాధేశ్యామ్' మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు ప్రభాస్. కానీ, ఆ చిత్రం తన ఫ్యాన్స్ ను నిరాశ పరచడం వల్ల.. అభిమానుల కోసం మరో సినిమాను ఇదే ఏడాది విడుదల చేసేందుకు ప్రభాస్ సన్నాహాలు చేస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డైరెక్టర్ మారుతి చెప్పిన 'రాజా డీలక్స్' కథకు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టును మే నెలలో పట్టాలెక్కించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ తుదిదశలో ఉందని తెలుస్తోంది. ఏప్రిల్ లో ఈ సినిమా మూహూర్తం ఖరారు చేసినట్లు కూడా టాలీవుడ్ లో చర్చ జరుగుతోంది. 


కేవలం తన అభిమానుల సంతోషం కోసమే ప్రభాస్ ఈ సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని.. ఈ ఏడాది ద్వితీయార్ధంలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది చిత్రబృందం. 'రాజా డీలక్స్' అనే టైటిల్ ను ఈ సినిమాకు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. 


హారర్, థ్రిల్లర్, కామెడీ జానర్లలో ప్రభాస్, మారుతిల కొత్త చిత్రం ఉండబోతోందని సమాచారం. ఇందులో ముగ్గురు హీరోయిన్లకు ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కృతిశెట్టి, రాశీ ఖన్నా, ప్రియాంక మోహనన్ లను పరిశీలిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల అంచనా. ఇప్పటికే 'ఆదిపురుష్' షూటింగ్ పూర్తి చేసుకున్న ప్రభాస్.. ప్రస్తుతం 'సలార్', 'ప్రాజెక్టు-కే' చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో 'స్పిరిట్' సినిమాలో నటించాల్సి ఉంది.  


Also Read: Ram Charan Gold Coin: 'బంగారు' మనసు చాటుకున్న మెగాపవర్ స్టార్.. RRR యూనిట్ కు స్పెషల్ గిఫ్ట్!


Also Read: Janhvi Kapoor Photos: షైనింగ్ డ్రస్సులో వజ్రంలా మెరిసిపోతున్న నటి జాన్వీ కపూర్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook