Prabhas - Kalki 2898 AD: రెబల్ స్టార్ ప్రభాస్.. బాహుబలి తర్వాత ప్రతి సినిమాను ప్యాన్ ఇండియా లెవల్లో చేస్తున్నాడు. ఇక బాహుబలి తర్వాత ఆ రేంజ్ సక్సెస్ మాత్రం 'సలార్' మూవీతో అందుకున్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ కటౌట్‌తో ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. అంతేకాదు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 700 కోట్ల గ్రాస్ వసూళ్లన రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు ఈ సినిమా సెకండ్ పార్ట్ సలార్- పార్ట్ 2 శౌర్యాంగ పర్వం షూటింగ్ ఆగష్టు వరకు పూర్తి కానుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ సంగతి పక్కన పెడితే.. ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేస్తోన్న 'కల్కి 2898 AD' కోసం దాదాపు 900 రోజులు డేట్స్ కేటాయించినట్టు సమచారం. ఇప్పటికే విడుదలైన బుజ్జి టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకొణే, దిశా పటానీ కథానాయికలుగా నటించారు. మరోవైపు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి స్టార్ హీరోస్ ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. తాజాగా ఈసినిమా రన్ టైమ్‌ను మేకర్స్ లాక్ చేసారు. మొత్తంగా 3 గంటల 5 నిమిషాల నిడివితో ఈ సినిమా ఉండనుందని సమాచారం. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.


మరోవైపు ఈ సినిమా ఓటీటీ రైట్స్ కూడా భారీ రేటుకు అమ్ముడు పోయినట్టు సమాచారం. దాదాపు 14 భాషలకు కలిపి రూ. 200 కోట్లకు ఓటీటీ రైట్స్ సోల్డ్ అయినట్టు సమాచారం. అటు శాటిలైట్ రైట్స్ అన్ని భాషలకు కలిపి రూ. 200 కోట్లకు అమ్ముడుపోయినట్టు సమాచారం. ఈ సినిమా థియేట్రికల్‌గా దాదాపు రూ. 350 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసే అవకాశాలున్నాయని
సమాచారం. ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా జూన్ 27న భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు కూడా జోరుగా సాగుతున్నాయి. త్వరలో కమల్ హాసన్‌ పాత్రకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేయనున్నారు మేకర్స్.


ప్రభాస్.. కల్కి మూవీ తర్వాత మారుతి దర్శకత్వంలో 'ది రాజా సాబ్' మూవీతో పాటు కన్నప్పలో శివుడి పాత్రలో కనిపించనున్నారు. అటు సలార్ పార్ట్ 2, సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్, హను రాఘవపూడితో రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో ఓ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ మూవీ.. సిద్ధార్ధ్ ఆనంద్‌తో స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ చేయనున్నాడు.


Read more: Cop cpr on monkey: హ్యాట్సాఫ్ సార్.. సీపీఆర్ చేసి కోతిని కాపాడిన పోలీసు.. వీడియో వైరల్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter