Radhe Shyam Movie release on OTT platform Amazon Prime Video on April 1: రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్‌, బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన ప్రేమకథా చిత్రం 'రాధేశ్యామ్‌'. మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మిశ్రమ టాక్ వచ్చింది. అయితే కలెక్షన్ల పరంగా పర్వాలేదనిపించుకున్న రాధేశ్యామ్‌ సినిమా.. ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ఈ పాన్ ఇండియా సినిమా రిలీజ్ కానుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉగాది కానుకగా ఏప్రిల్‌ 1నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో రాధేశ్యామ్‌ సినిమా స్ట్రీమింగ్‌ కానుంది. అమెజాన్‌ సరికొత్త ట్రైలర్‌ను విడుదల చేసి ఈ విషయాన్ని తెలిపింది. రాధేశ్యామ్‌ సినిమాలో ప్రభాస్‌ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హస్తసాముద్రికా నిపుణుడి పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఇక పూజా హెగ్డే డాక్టర్‌ ప్రేరణగా ఆకట్టుకుంది. వెండి తెరపై ప్రభాస్‌-పూజాల కెమెస్ట్రీ బాగుంది. పాటలు, విజువల్‌ ఎఫెక్ట్స్‌ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి.  


రాధేశ్యామ్ థియేటర్లలో విడుదల అయి కనీసం నాలుగు వారాలు కూడా కాలేదు. అప్పుడే సినిమాను ఓటిటీలో రిలీజ్ చేస్తున్నారు. దాంతో అభిమానులు కాస్త ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. అదే సమయంలో సంబరపడిపోతున్నారు కూడా. తెలుగులో మాత్రమే కాకుండా..  మిగతా భాషల్లో కూడా రాధేశ్యామ్ సినిమా ఓటీటీ ద్వారా ప్రేక్షకులకి అందుబాటులోకి రానుంది. థియేటర్లో మిశ్రమ టాక్ అందుకున్న ఈ సినిమా.. ఓటిటీలో ఎలాంటి విజయం అందుకుంటుందో చూడాలి.



1960 నాటి వింటేజ్‌ ప్రేమకథగా వచ్చిన రాధేశ్యామ్ సినిమాని యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా నిర్మించారు. టాలీవుడ్ సీనియర్ నటుడు కృష్ణంరాజు కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా ద్వారా బాలీవుడ్‌ నటి భాగ్యశ్రీ రీఎంట్రీ ఇచ్చారు. ఇందులో ఆమె ప్రభాస్‌ తల్లిగా చేశారు. ఇక జగపతి బాబు, మురళీ శర్మ, సచిన్ ఖేడేకర్, ప్రియదర్శి, కునాల్ రాయ్ కపూర్,  సత్యన్ ముఖ్య పాత్రలు పోషించారు. 


Also Read: GT vs LSG: ఐపీఎల్‌లో తొలిసారి బరిలోకి గుజరాత్, లక్నో.. ఇరు జట్లలో గేమ్ ఛేంజర్స్‌ వీరే! ఇక డబిడదిబిడే!


Also Read: Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్‌కి భారీ షాక్.. మరో స్టార్ ప్లేయర్ ఔట్!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook