Prabhas Salaar : పాటలు, కామెడీ లేకుండానే విడుదల.. సలార్ మేకర్ల నిర్ణయం కరెక్టే!
Salaar English Version ప్రభాస్ సలార్ సినిమాను ఇంగ్లీష్ వర్షెన్లోనూ విడుదల చేయాలని మేకర్లు ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇండియాలో రిలీజ్ అయ్యే సలార్‌కు, ప్రపంచ దేశాల్లోని ఇంగ్లీష్ భాషలో రిలీజ్ చేసే సినిమాకు భారీ తేడా ఉంటుందట.
Prabhas Prashanth Neel Salaar ప్రభాస్ ప్రశాంత్ నీల్ సలార్ మీద దేశం మొత్తం కన్నేసింది. ఇక ఈ సారి ప్రభాస్‌తో ప్రశాంత్ నీల్ సైతం హాలీవుడ్ బాట పట్టేస్తున్నాడు. ఈ సినిమాను ఇంగ్లీష్ భాషలోనూ విడుదల చేయబోతోన్నారు. అయితే ఇంగ్లీష్ వర్షెన్‌లో మాత్రం పాటలు, కామెడీ ట్రాక్‌ను తీసేయాలని ప్రశాంత్ నీల్ ఫిక్స్ అయ్యాడట. మేకర్లు సైతం ఓకే అన్నారట. తెలుగులో దాదాపు రెండున్నర గంటలు ఉంటే.. ఇంగ్లీష్‌లో మాత్రం రెండు గంటల నిడివి ఉంటుందట.
బాహుబలితో ప్రభాస్‌కు ఇంటర్నేషనల్ వైడ్‌గా క్రేజ్ వచ్చింది. కేజీయఫ్ సినిమాలతో ప్రశాంత్ నీల్ పేరు కూడా ఇంటర్నేషనల్ మార్కెట్‌లో వినిపించింది. ఇక ఈ సలార్ సినిమాను ఇంగ్లీష్ భాషలోనూ విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు. అయితే ఇంగ్లీష్ వర్షెన్‌లో మాత్రం చాలా మార్పులు చేర్పులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
ముఖ్యంగా పాటలు, కామెడీ ట్రాక్ వంటివాటిని కత్తిరించాలని అనుకుంటున్నారట. దీంతో ఒరిజినల్ వర్షన్ కంటే ఇంగ్లీష్ వర్షెన్‌లో ఓ అర్దగంట నిడివి తక్కువగా ఉంటుందని తెలుస్తోంది. మరి ఈ నిర్ణయం అయితే హాలీవుడ్ వరకు కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే హాలీవుడ్ ఆడియెన్స్‌కు పాటలు, కామెడీ ట్రాక్ అనేది సెట్ కాదు. సినిమా అంతా ఒకే మూడ్‌లో ఉండాలని కోరుకుంటారు.
ఇండియాలో రిలీజ్ అయ్యే సినిమా మాత్రం పక్కా కమర్షియల్ మీటర్‌లో ఉంటుందని తెలుస్తోంది. మాస్ ఆడియెన్స్‌కు ఎలాంటి స్టఫ్ కావాలో అలానే సలార్ ఉంటుందని తెలుస్తోంది. అసలే ఈ సినిమా మీద అంచనాలు ఆకాశన్నంటాయి. ప్రశాంత్ నీల్ కేజీయఫ్ చాప్టర్ 2 రికార్డులు బద్దలు కొట్టేస్తాడా? బాహుబలి రికార్డులను ప్రభాస్ రీ క్రియేట్ చేస్తాడా? అని అభిమానులు అనుకుంటూ ఉన్నారు. బాహుబలి తరువాత మళ్లీ అసలు సిసలు మాస్ ఎంటర్టైనర్ ఇదే కావడంతో డార్లింగ్ ఫ్యాన్స్ సైతం భారీ అంచనాలతో ఉన్నారు.
Also Read: Ajith Father Death : తలా ఇంట్లో విషాదం.. అజిత్ తండ్రి మరణం
Also Read: Jabardasth Indraja : షోలో ఇంద్రజకు అవమానం.. ఇది కరెక్ట్ కాదంటూ ఎమోషనల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook