Prabhas marraige Date బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్ పెళ్లి గురించి ఎలా కౌంటర్లు పడుతుంటాయో.. మనకు ఇక్కడ ప్రభాస్ పెళ్లి మీద అలాంటి సెటైర్లు వస్తుంటాయి. ఎవరైనా కుర్ర హీరోలను పెళ్లి గురించి అడిగితే.. ప్రభాస్‌ పెళ్లితో ముడిపెడుతుంటారు. ప్రభాస్ పెళ్లి చేసుకున్నాక తాము పెళ్లి చేసుకుంటామని తప్పించుకుంటారు. రీసెంట్‌గా విశాల్ కూడా ఇదే కౌంటర్ వేశాడు. అయితే ఇకపై ఎవ్వరికీ ఆ చాన్స్ దక్కదని తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రభాస్ పెళ్లి ఇంకో రెండు నెలల్లో జరగబోతోందని తెలుస్తోంది. ఈ విషయాన్ని రామ్ చర లీక్ చేశాడట. అన్ స్టాపబుల్ షోలో రామ్ చరణ్‌ వీడియో కాల్ ద్వారా ప్రభాస్‌ను పలకరించాడని తెలుస్తోంది. అయితే ఇందులో భాగంగా ప్రభాస్ సీక్రెట్‌ను చెప్పమని బాలయ్య అడిగినట్టు టాక్. దీంట్లో భాగంగా ప్రభాస్ పెళ్లి గురించి లీక్ చేశాడట.


 



ప్రభాస్ పెళ్లి ఇంకో రెండు నెలల్లో ఉంటుందని రామ్ చరణ్‌ చెబితే.. వచ్చే ఏడాదిలో పెళ్లి అని గోపీచంద్ కౌంటర్ వేస్తాడట.ఇంకొన్ని రోజుల్లోనే ఈ ఏడాది గడిచిపోనుంది. అంటే ఫిబ్రవరిలో ప్రభాస్ పెళ్లి ఉండేలా కనిపిస్తోంది. అయితే ఈ లీక్స్ అన్నీ ఎంత వరకు నిజమో గానీ.. తాజాగా వదిలిన గ్లింప్స్ మాత్రం ఇప్పుడు వైరల్ అవుతోంది.


ఇందులో ప్రభాస్ ఓ మాట అనేశాడు. రేయ్ ఏం చెబుతున్నావ్ డార్లింగ్ అని ప్రభాస్ అన్న మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అది రామ్ చరణ్‌ గురించే అన్నాడని, పెళ్లి గురించి లీక్ చేయడంతోనే అలా అన్నాడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరి నిజంగానే ప్రభాస్ పెళ్లి గురించి రామ్ చరణ్ అన్నాడా? లేదా? అంటే ఏం అన్నాడు అనేది తెలియాలంటే ఎపిసోడ్ వచ్చే వరకు ఆగాల్సిందే


Also Read : Gruhalakshmi Tulasi : కారు, ఏసీ, టీవీలు లేవు.. ఫోన్ పోయింది.. సంపాదించిందంతా కూడా అటే.. గృహలక్ష్మీ తులసి


Also Read : Saawariya Ranbir Kapoor : రణ్‌బీర్ కపూర్‌ను నగ్నంగా చూశా.. ఆ అదృష్టం నాకే దక్కింది.. లేడీ అసిస్టెంట్ డైరెక్టర్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook