Saawariya Ranbir Kapoor : రణ్‌బీర్ కపూర్‌ను నగ్నంగా చూశా.. ఆ అదృష్టం నాకే దక్కింది.. లేడీ అసిస్టెంట్ డైరెక్టర్

Saawariya Ranbir Kapoor రణ్‌బీర్ కపూర్, సోనమ్ కపూర్ కలిసి నటించిన సావరియా సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టేసింది. అయినా కూడా ఈ సినిమాతో ఇద్దరు స్టార్లుగా మారారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 13, 2022, 06:32 PM IST
  • పదిహేనేళ్ల సావరియా సినిమా
  • రణ్‌బీర్ కపూర్‌ను నగ్నంగా చూసిందట
  • లేడీ అసిస్టెంట్ డైరెక్టర్ కామెంట్స్ వైరల్
Saawariya Ranbir Kapoor : రణ్‌బీర్ కపూర్‌ను నగ్నంగా చూశా.. ఆ అదృష్టం నాకే దక్కింది.. లేడీ అసిస్టెంట్ డైరెక్టర్

Shailey Sharma about Ranbir Kapoor Drops Towel సావరియా సినిమా వచ్చి ఇప్పటికి పదిహేనేళ్లు అవుతోంది. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్, రాణీ ముఖర్జీ, సోనమ్ కపూర్, రణ్‌బీర్ కపూర్‌లు నటించారు. అయితే ఈ చిత్రం మాత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టేసింది. ఈ సినిమా వచ్చి పదిహేనేళ్లు అవుతున్న సందర్భంగా కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. ఈ చిత్రానికి అడిషనల్ డైలాగ్ రైటర్ కమ్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన శైలీ శర్మ కొన్ని సంగతులు బయటపెట్టేసింది.

శైలీ శర్మ మాట్లాడుతూ.. ఈ సినిమా షూటింగ్ జరిగే సమయంలో రణ్‌బీర్‌ కపూర్‌ను నగ్నంగా చూశానని, సెట్‌లో అందరినీ బయటకు పంపించేశారని, కానీ తనను మాత్రం అక్కడే ఉంచేశారని, అలా తనకు రణ్‌బీర్ కపూర్‌ని నగ్నంగా చూసే అదృష్టం వచ్చిందంటూ నవ్వేసింది. అసలు ఇంతకీ అక్కడ జరిగిన మ్యాటర్ ఏంటో ఓ సారి చూద్దాం.

సావరియా సినిమాలో ఓ పాటలో భాగంగా రణ్‌బీర్ మొత్తంగా టవల్ మీద ఉంటాడు. ఒంటి మీద టవల్ తప్పా ఏమీ లేకుండా షూటింగ్ చేసే ఆ సమయంలో కొన్ని సంఘటనలు జరిగాయి. మధ్య మధ్యలో రణ్‌బీర్ టవల్ ఊడిపోయేదట. ఓ షాట్లో రణ్‌బీర్ టవల్‌తో ఉండగానే.. కుర్చీలో కూర్చోని.. దాన్ని అటుగా తన్నేసి కిందపడిపోవాల్సిన షాట్ ఉంటుంది. అయితే ఈ షాట్‌లో కుర్చీని, తన టవల్‌ను రెండింటిని బ్యాలెన్స్ చేయలేకపోయాడట. అక్కడ చాలానే టేక్స్ పడ్డాయట.

ఆ సమయంలోనే రణ్‌బీర్ టవల్ ఊడిపోయిందట. ఆ సమయంలో సెట్‌లో ఉన్న ఆడవాళ్లందరినీ బయటకు పంపించేశారట. కానీ తనను మాత్రం ఎవ్వరూ వెళ్లమని అడగలేదట. దీంతో రణ్‌బీర్ కపూర్‌ను నగ్నంగా చూసే అదృష్టం దొరికిందని జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలను చెప్పేసింది.

Also Read : Urfi Javed Video : సిగ్గులేదంటూ పోస్ట్.. ఉర్ఫీ వీడియో వైరల్.. ఇంతకంటే దిగజారడం కష్టమేనేమో!

Also Read : Upasana Pregnancy : తండ్రి కాబోతోన్న రామ్ చరణ్‌.. సుష్మిత, శ్రీజల పోస్టులు వైరల్.. ఇక రెడీ అంటూ కామెంట్స్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News