టి-సిరీస్ బ్యానర్‌లో తన్హాజి సినిమా ఫేమ్ ఓం రావత్ దర్శకత్వం వహించనున్న ప్రభాస్ 22వ ప్రాజెక్ట్ అయిన ఆదిపురుష్ సినిమాకి సంబంధించి మరో లేటెస్ట్ అప్‌డేట్‌ను గురువారం ఉదయం గం. 7.11 లకు విడుదల చేయనున్నట్లు ప్రభాస్ తన ఇన్‌స్టాగ్రాంలో పేర్కొన్నాడు. చెడు మీద మంచి గెలవడం గురించే ఈ ఆదిపురుష్ చిత్రం. ఈ ప్యాన్ ఇండియా చిత్రంలో శ్రీరామునిగా ప్రభాస్, రావణాసురునిగా సైఫ్ అలీ ఖాన్ చేయనున్నట్లు ఈ చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమాలో కీలక పాత్రలైన సీత, హనుమ, లక్ష్మణ క్యారెక్టర్స్ ఎవరు చేయబోతున్నారు అనే విషయంలోనే ఇంకా ఓ స్పష్టత రాలేదు. అటు ప్రభాస్ అభిమానులు సైతం ఆ వివరాలు తెలుసుకునేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ప్రభాస్ సరసన సీతగా ( Sita in Adipurush ) ఎవరు చేయబోతున్నారు అనే చాలా రోజులుగా హాట్ టాపిక్‌గా మారింది.



 


 



ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఆదిపురుష్ చిత్ర బృందం ఏం సర్‌ప్రైజ్ చేస్తారో అని ప్రభాస్ అభిమానులు ( Prabhas fans ) ఎదురుచూసారు కానీ ఆఖరికి వారికి నిరాశే మిగిలింది. ఏవేవో కారణాల వల్ల దసరా, దీపావళి పండగల సందర్బంగా కూడా ఈ సినిమా గురించి ఎలాంటి అప్‌డేట్స్ రాలేదు. అందరూ ఎదురుచూస్తున్న అప్‌డేట్ గురువారం ఉదయం 7.11 గంటలకు విడుదల చేయనున్నట్టు ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపాడు.


Also read : Bigg Boss 4 Telugu : బిగ్ బాస్ హౌజ్‌లో ఎమోషనల్ మూమెంట్స్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.


మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి