Salaar Breaks RRR Record: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా 'సలార్'. ఈ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. తొలి భాగానికి 'సలార్: పార్ట్ 1 సీజ్‌ఫైర్'గా(Salaar: Part 1- Ceasefire) పేరు పెట్టారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబరు 28న విడుదల కానుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే రిలీజ్ కు ముందే సలార్ సంచనాలు సృష్టిస్తోంది తాజాగా 'ఆర్ఆర్ఆర్'(RRR) నెలకొల్పిన రికార్డును బ్రేక్ చేసింది సలార్. అది కూడా అమెరికాలో కావడం విశేషం. ఆ దేశంలోని అన్ని సినీమార్క్ థియేటర్లలో ఈ మూవీ రిలీజ్ కానుందని సలార్ యూఎస్ డిస్ట్రిబ్యూటర్ వెల్లడించారు. ఏ తెలుగు సినిమా ఇప్పటివరకు ఇలాంటి ఘనత సాధించలేదు. ఆర్ఆర్ఆర్ సినిమా మాత్రం 285 సినీమార్క్ థియేటర్లలో విడుదలై రికార్డు క్రియేట్ చేయగా.. ఇప్పుడు సలార్ దానిని అధిగమించబోతుంది. అంతేకాదు నార్త్ అమెరికాలో ఏకంగా సలార్ మూవీ 1980కిపైగా స్క్రీన్లలో ప్రదర్శితం కానుంది. ఐమ్యాక్స్ వెర్షన్ కూడా అక్కడ విడుదల చేయనున్నారు. 


రెండు పార్టులుగా రాబోతున్న సలార్ మూవీలో శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో మలయాళ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు తదితరులు కీ రోల్స్ లో పోషిస్తున్నారు. కన్నడ స్టార్ హీరో యష్ సలార్ లో గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని హోంబలే ఫిలింస్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఈ సినిమా నుంచే ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, టీజర్ కు మంచి స్పందన వచ్చింది. కేజీఎఫ్ తరహాలో సలార్ మూవీ ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది. 


Also Read: Alia Bhatt: హాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ కి తెలుగు నేర్పించిన ఆలియాభట్‌, వీడియో వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook