Prabhas Salaar look Leak: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), 'కేజీఎఫ్' డైరెక్టర్​ ప్రశాంత్​నీల్  కాంబోలో తెరకెక్కుతున్న సినిమా 'సలార్​' (Salaar Movie). మాస్ మసాలా మూవీగా రూపొందుతున్న ఈ చిత్రానికి లీక్ ల బెడద తప్పడం లేదు. తాజాగా సినిమా షూటింగ్​ స్పాట్​లోని ప్రభాస్​ లుక్​ లీకైంది (Prabhas look Leak). ఇందులో ప్రభాస్ పుల్ మాస్​ లుక్​తో కనిపిస్తున్నాడు. ఇది కాస్తా నెట్టింట వైరల్ గా మారింది. తాజాగా లుక్ పై డార్లింగ్ ఫ్యాన్స్ తమదైన శైలిలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ఘాటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమాను తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కించటంతోపాటు పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా ద్వారా ప్రభాస్ కన్నడ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇందులో డార్లింగ్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నట్లు సమాచారం. ఇందులో శ్రుతిహాసన్​ కథానాయికగా నటిస్తోంది. 'కేజీఎఫ్​' ఫేమ్​ రవి బస్రూర్​ సంగీతాన్ని అందిస్తున్నారు. జగపతిబాబు, కన్నడ నటుడు మధు గురుస్వామి, మలయాళ హీరో పృథ్వీరాజ్​ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. హోంబలే ఫిలింస్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. 


ఇటీవల `రాధేశ్యామ్‌`(Radheshyam)తో ప్రేక్షకులు ముందుకు వచ్చారు ప్రభాస్. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. ఈ సినిమా డిజాస్టర్ అవ్వడంతో డార్లింగ్ ఫ్యాన్స్ సలార్ పైనే అన్ని ఆశలు పెట్టుకున్నారు. మే నెలాఖరున ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్‌ నటించిన మరోసినిమా 'ఆదిపురుష్‌' త్వరలో విడుదల కానుంది. అంతేకాకుండా నాగ్‌ అశ్విన్‌తో 'ప్రాజెక్టు-కే' అనే సినిమా చేస్తున్నారు ప్రభాస్.


Also Read: KGF Yash Wife Pics: బాలీవుడ్ హీరోయిన్లను తలదన్నుతున్న కేజీఎఫ్ హీరో యశ్ భార్య రాధికా ఫోటోలు 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook