Prabhas Salaar Movie Release Date Announced: ఈ మధ్యనే రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ వరుస సినిమాలను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఆయన చేస్తున్న అన్ని సినిమాల కంటే ఆయన హీరోగా నటిస్తున్న సలార్ మీద భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. కేజిఎఫ్,  కేజిఎఫ్ 2 సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తూ ఉండడం,  ప్రభాస్ పూర్తి స్థాయి మాస్ లుక్ లో కనిపిస్తూ ఉండడంతో సినిమా మీద ఏర్పడుతున్న అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమాకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే సినిమా యూనిట్ ఒక అప్డేట్ ప్రకటించింది. సినిమాకు సంబంధించిన అప్డేట్ ప్రకటిస్తామని ముందు పేర్కొన్న యూనిట్ చెప్పిన సమయానికి సినిమా నుంచి అప్డేట్ రిలీజ్ చేసింది. ఇక ఈ సినిమా అప్డేట్ విషయానికి వస్తే సలార్ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 28 2023వ సంవత్సరంలో ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నామని సినిమా యూనిట్ ప్రకటించింది.


ఇక ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటిస్తూ ఉండగా శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్,  జగపతిబాబు,  విశాల్ వదిన శ్రేయ రెడ్డి కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు కేజిఎఫ్ సినిమాటోగ్రాఫర్ భువన్ గౌడ,  సినిమాటోగ్రాఫర్గా వ్యవహరిస్తున్నారు. అలాగే కేజిఎఫ్ సిరీస్ కి సంగీతం అందించిన రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. అలాగే శివకుమార్ ఆర్ట్ డైరెక్షన్ చేస్తున్న ఈ సినిమాకు అన్బరువు యాక్షన్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. ఇక కేజిఎఫ్ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ బ్యానర్ మీద విజయ్ కిరంగదూర్ నిర్మిస్తున్నారు. ఇక సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తూనే ప్రభాస్ ని మాస్ లుక్ లో చూపిస్తూ ఉండడం ఆసక్తికరంగా మారింది. సినిమా బొగ్గు గనులలో షూటింగ్ జరుపుకోవడంతో ఈ సినిమా గురించి కూడా అనేక రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. [[{"fid":"241492","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


Also Read: Bimbisara vs Sita Ramam: పదిరోజుల్లో కోట్లలో లాభాలు.. ఫుల్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ఇదే!


Also Read: NTR- Samantha: టాలీవుడ్ టాపర్లుగా ఎన్టీఆర్, సమంత.. టాప్ టెన్లో ఇంకా ఎవరెవరు ఉన్నారంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి