Prabhas seeks blessings at Tirumala temple: ప్రభాస్ హీరోగా నటించిన ఆది పురుష్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చరిత్రలో వెన్నడో లేనివిధంగా జరుపబోతోంది సినిమా యూనిట్. ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఆది పురుష్ సినిమా తెరకెక్కింది. ప్రభాస్ రాముడి పాత్రలో నటించగా కృతి సనన్ సీత పాత్రలో నటించింది. దేవదత్త నాగే, సన్నీ సింగ్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రావణాసురుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించిన ఈ సినిమా జూన్ 16వ తేదీన తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాదు పాన్ ఇండియా లెవెల్ లో భారీ ఎత్తున రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. ఈరోజు జరగబోతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఇప్పటికే సినిమా యూనిట్ అంతా అక్కడికి చేరుకుంది. ఇక ఈ ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని ప్రభాస్ సన్నిహితులతో కలిసి సందర్శించాడు.


Also Read: Lavanya tripathi Photos: ఎంగేజ్మెంట్ కి ముందు లావణ్య హాట్ ట్రీట్.. వదినమ్మా అంటున్న నెటిజన్లు


తెల్లటి కుర్తా పైజామాలో ప్రభాస్ నడుచుకుంటూ బయటకు వస్తున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ రోజు జరగబోతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సెకండ్ ట్రైలర్ కూడా ప్రేక్షకుల కోసం రిలీజ్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. రామాయణ కథనే సరికొత్తగా తెరకెక్కించి ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు టీమ్.


ఇక ఈ సినిమాని సుమారు 550 కోట్ల రూపాయల బడ్జెట్ తో టి సిరీస్ సంస్థ నిర్మించగా ఈ సినిమాను ఓం రౌత్ సహ నిర్మించాడు. అలాగే రెట్రో ఫైల్స్ అనే సంస్థ కూడా నిర్మాణంలో భాగస్వామ్యం అయింది. నిజానికి ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది కానీ గ్రాఫిక్స్ వర్క్ మీద ట్రోలింగ్ జరిగిన నేపథ్యంలో మళ్లీ గ్రాఫిక్స్ వర్క్ అంతా చేయించడంతో సినిమా రిలీజ్ లేట్ అయింది. ఇక ఎట్టకేలకు జూన్ 16వ తేదీన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలతో పాటుగానే పలు విదేశీ భాషల్లో సైతం సినిమాని రిలీజ్ చేస్తున్నారు. 


Also Read: Keerthy Suresh Photos: పొట్టి గౌనులో కీర్తి సురేష్ అందాల విందు.. హీటెక్కిస్తోందిగా! 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి