Tollywood Number 1 హీరోగా ప్రభాస్… ఒక్క అప్డేట్ కూడా లేకుండా సూపర్ క్రేజ్ ఎలా?
Prabhas Tollywood Number 1 hero : మే నెలకు గాను టాలీవుడ్ నెంబర్ 1 హీరో ప్రభాస్ అని ఒక సర్వే సంస్థ తేల్చింది. అయితే ఈ విషయం మీద సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
Prabhas Tollywood Number 1 hero : టాలీవుడ్ లో నెంబర్ వన్ ఎవరు? అంటే ఏమని చెప్పగలం. హీరోల అభిమానులు అయితే మా హీరో గొప్ప అంటే మా హీరోనే గొప్ప అనుకుంటూ ఉంటారు. కానీ అసలు టాలీవుడ్ లో ఎవరు నెం. 1 అంటే ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఎవరు ఏమి చెప్పినా దాన్ని లెక్క వేయలేం. కానీ ఒక సర్వే కంపెనీ మాత్రం ఈ విషయంలో చొరవ తీసుకుని మీడియా, సోషల్ మీడియా ట్రెండ్స్ ను బట్టి ప్రతి నెలా ఎవరు ఎక్కవగా చర్చలో ఉన్నారనే విషయాన్ని బట్టి బేరీజు వేసుకుని ఒక లిస్ట్ జారీ చేస్తూ వస్తోంది. ఇప్పుడు ఆ కంపెనీ తాజాగా మే నెలకు సంబంధించిన లిస్ట్ విడుదల చేసింది.
ఓర్మాక్స్ మీడియా అనే ఒక సంస్థ కేవలం సినిమానే కాక ఓటీటీ, స్పోర్ట్స్, న్యూస్, మ్యూజిక్ వంటి రంగాల మీద దృష్టి పెట్టి ఎవరు ఎక్కువ ఎలాంటి విషయం మీద ఆసక్తి చూపిస్తున్నారు అనే విషయం మీద అనాలిసిస్ చేస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా ప్రతి వారం ప్రేక్షకులు ఏ సీరియల్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు, లేక ఎక్కువ ఏ పాట వినడానికి ఆసక్తి చూపిస్తున్నారు అనే విషయం మీద అప్డేట్స్ విడుదల చేస్తూ ఉంటుంది. ఇక ఈ క్రమంలో మే నెలకు గాను తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా ఏ హీరో గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపించారు? ఎక్కువ మీడియాలో, సోషల్ మీడియాలో ఎవరి గురించి చర్చ జరిగింది అనే విషయాలను పరిగణలోకి తీసుకుని ఒక లిస్ట్ విడుదల చేసింది.
ఆ లిస్టు ప్రకారం మే నెలలో తెలుగు ప్రేక్షకులు ప్రభాస్ గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపించారు. ఎక్కువగా మీడియాలో, సోషల్ మీడియాలో ప్రభాస్ గురించి చర్చ జరగడంతో ఆయన నెంబర్ 1 ప్లేస్ లో నిలిచాడు. నిజానికి మే నెలలో ప్రభాస్ కు సంబంధించిన ఎలాంటి సినిమా విడుదల కాలేదు. ఒకరకంగా చెప్పాలంటే సినిమాల గురించి అనఫీషియాల్ గాసిప్స్ తప్ప అఫీషియల్ అప్డేట్ మాత్రం ఒక్కటి కూడా విడుదల కాలేదు. అయినా ఆయన నెంబర్ 1 గా నిలిచాడు. ఇక 2021 ఏడాది మొత్తం మొదటి స్థానం సాధించిన మహేష్ బాబు గత నెలలలో కొంచెం వెనుక పడ్డాడు కానీ ఇప్పుడు మాత్రం మళ్ళీ పుంజుకుని రెండో స్థానానికి వచ్చాడు.
మహేష్ బాబు హీరోగా నటించిన సర్కారు వారి పాట సినిమా మే 12న విడుదల కావడంతో ఆయనకు రెండో స్థానం లభించిందని చెప్పొచ్చు. ఇక ఈ లిస్టులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మూడో స్థానంలో, అల్లు అర్జున్ నాలుగో స్థానంలో, రామ్ చరణ్ ఐదవ స్థానంలో, పవన్ కళ్యాణ్ ఆరవ స్థానంలో నిలిచారు. ఇక నేచురల్ స్టార్ నాని ఏడవ స్థానంలో, రౌడీ విజయ్ దేవరకొండ ఎనిమిదవ స్థానంలో, చిరంజీవి తొమ్మిదో స్థానంలో, రవితేజ పదో స్థానంలో నిలిచాడు. ఇక ప్రభాస్ సినిమా కానీ సినిమాకు సంబంధించిన అప్డేట్ కూడా లేకుండానే టాప్ 1గా నిలవడంతో మా ప్రభాస్(Prabhas) తోపు అంటూ కామెంట్ చేస్తున్నారు ఆయన అభిమానులు. ఇక ఇతర హీరోల అభిమానులు ఇదేదో ఫేక్ అనిపిస్తోంది, ఇలా అప్డేట్ కూడా లేకుండా ఎలా నెంబర్ 1 అవుతాడు అంటూ కామెంట్ చేస్తున్నారు.
Also Read :Naga Chaitanya : నాగచైతన్యకు గోల్డెన్ ఛాన్స్.. మిస్సయితే మరక తప్పదు మరి!
Also Read : Nayanthara Conditions: దర్శకనిర్మాతలకు నయనతార కొత్త కండీషన్.. సినిమా అవకాశాలు వచ్చేనా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook