యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పీరియాడిక్ డ్రామా రాధే శ్యామ్ సినిమాతో ( Radheshyam movie ) బిజీగా ఉన్నాడు. తాజాగా ఇటలీలో షూటింగ్ ముగించుకొని నవంబర్ 2న తిరిగి హైదరాబాద్ చేరుకుంది ఈ చిత్ర బృందం. రాధా కృష్ణ కుమార్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా తిరిగి నవంబర్ 5 నుండి అన్నపూర్ణ స్థూడియోలో వేసిన ప్రత్యేక సెట్స్‌లో మిగిలిన షూటింగ్ జరగనుంది అని టాక్. Also read : Jr Ntr on video call: వీడియో కాల్ చేసిన ఎన్టీఆర్‌ని అభిమాని ఏం అడిగాడో తెలుసా ?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రభాస్ ( Prabhas ) సరసన ఈ సినిమాలో పూజా హెగ్డే ( Pooja Hegde ) నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ విక్రమ్ ఆదిత్యగా ( Prabhas as Vikram Aditya ), అలాగే పూజా హెగ్డే ప్రేరణగా కనిపించనున్నారు. ప్రభాస్, పూజల బర్త్ డే సందర్బంగా ప్రేరణ, విక్రమ్ ఆదిత్యల ఫస్ట్ లుక్ పోస్టర్‌లు రిలీజ్ చేశారు ఈ చిత్ర బృందం. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్స్‌కి అభిమానుల నుంచి భారీ స్పందన లభించింది కూడా.


రాధే శ్యామ్ సినిమా తరువాత ప్రభాస్ మరో రెండు సినిమాలకు సైన్ చేసిన సంగతి తెలిసిందే. అందులో ఒకటి మహానటి సినిమా ఫెమ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్‌తో ( Nag Ashwin ) ఉండగా, మరొకటి బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ( Om Raut ) డైరెక్షన్‌లో ఆదిపురుష్ సినిమాలో నటించనున్నాడు. Also read : KGF 2 teaser: కేజీఎఫ్ 2 ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్


తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా మొత్తం షూటింగ్‌ని డిసెంబర్ చివరి నాటికి ముగించి, జనవరి నుండి ఆదిపురుష్ షూటింగ్‌లో చేరడానికి సిద్ధంగా ఉన్నాడు అని తెలుస్తోంది. ఫిలింనగర్‌లో వినిపిస్తున్న ఈ టాక్ నిజమే అయితే.. మరి నాగ్ అశ్విన్‌తో సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఐతే, సినిమా వాళ్లకు ఏకకాలంలో రెండు సినిమాల్లో నటించడం కొత్తేమీ కాదు కదా అనే వాళ్లూ లేకపోలేదు. అంటే.. నాగ్ అశ్విన్‌తో సినిమా చేస్తూనే ఆదిపురుష్ మూవీ కూడా చేయనున్నాడన్న మాట. ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. టి-సిరీస్ బ్యానర్‌లో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. Also read : Alia Bhatt: తారక్ రిక్వెస్ట్‌ చేశాడనే రాజమౌళి ఈ నిర్ణయం తీసుకున్నాడా ?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe