KGF 2 teaser: కేజీఎఫ్ 2 ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్

KGF 2 teaser release date updates: కన్నడ యాంగ్రి యంగ్ మేన్ యష్ హీరోగా వచ్చిన కేజీఎఫ్ చిత్రం దేశ వ్యాప్తంగా సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కెజిఎఫ్ 2 షూటింగ్ ( KGF 2 shooting ) చివరి దశకు చేరుకుంది. విలన్‌గా నటిస్తోన్న సంజయ్ దత్‌పై ( Sanjay Dutt ) క్లైమాక్స్ సీన్స్ చిత్రీకరణ పూర్తయితే ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుంది అని సమాచారం.

Last Updated : Nov 4, 2020, 12:09 AM IST
  • కేజీఎఫ్ 2 మూవీ టీజర్ విడుదలకు ప్రయత్నాలు ముమ్మరం.
  • చివరి దశకు చేరుకున్న కేజీఎఫ్ 2 మూవీ షూటింగ్
  • దీపావళికి టీజర్ విడుదల చేసి సంక్రాంతికి సినిమా విడుదల చేసే యోచనలో కేజీఎఫ్ 2 మూవీ యూనిట్
KGF 2 teaser: కేజీఎఫ్ 2 ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్

KGF 2 teaser release date updates: కన్నడ యాంగ్రి యంగ్ మేన్ యష్ హీరోగా వచ్చిన కేజీఎఫ్ చిత్రం దేశ వ్యాప్తంగా సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కెజిఎఫ్ 2 మూవీ షూటింగ్ ( KGF 2 shooting ) చివరి దశకు చేరుకుంది. విలన్‌గా నటిస్తోన్న సంజయ్ దత్‌పై ( Sanjay Dutt ) క్లైమాక్స్ సీన్స్ చిత్రీకరణ పూర్తయితే ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుంది అని సమాచారం. కరోనా లాక్‌డౌన్ కారణంగా అన్ని సినిమాల షూటింగ్స్ ఆగిపోవడంతో షూటింగ్ ఆలస్యం అయింది. లేదంటే అక్టోబర్‌లోనే ఈ సినిమాని విడుదల చేయాలని మొదట ఈ చిత్ర యూనిట్ యోచించింది. Also read : Alia Bhatt: తారక్ రిక్వెస్ట్‌ చేశాడనే రాజమౌళి ఈ నిర్ణయం తీసుకున్నాడా ?

ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ ఆఖరి దశకు చేరుకోవడంతో కేజిఎఫ్ అభిమానులు ఈ సినిమా టీజర్ ( KGF 2 teaser ) ఎప్పుడు విడుదల చేస్తారా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దసరా పండగా కానుకగా ఈ సినిమా టీజర్ విడుదల కానుంది అని సినీ వర్గాల్లో టాక్ వినిపించింది. కానీ అలా జరగలేదు.

తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం ప్రశాంత్ నీల్ ( Prashanth Neel ) డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా టీజర్‌ను దీపావళి పర్వదినం సందర్భంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమా సంక్రాంతి పండగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది అని సమాచారం. అందుకే టీజర్ విడుదల చేయడానికి దీపావళి ( Diwali 2020 ) మంచి సమయం అని చిత్ర బృందం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకి అభిమానులు ఆశిస్తున్నట్లుగా దీపావళి పర్వదినం ( Deepawali 2020 ) రోజున ఈ టీజర్ విడుదలైతుందో లేదో చూడాలి మరి. Also read : PSPK27 actress: పవన్ కల్యాణ్ సినిమాకు హీరోయిన్ ఫిక్స్ ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News