Prabhas: మలయాళ స్టార్ హీరో డైరెక్షన్లో ప్రభాస్.. డార్లింగ్ నయా ఫ్లాన్ తో బాక్సాఫీస్ షేక్..!
Prabhas latest movies: వరుస సినిమాలతో అలరించేందుకు రెడీ అవుతున్నారు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ఓ పక్క షూటింగ్స్ లో బిజీగా గడుపుతూనే... మరో పక్క కొత్త ప్రాజెక్టులకు ఓకే చెబుతున్నారు. తాజాగా మరో సినిమాకు ఓకే చెప్పారట డార్లింగ్.
Prabhas Upcoming Movies: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) వరుసగా సినిమాలను పట్టాలెక్కిస్తున్నారు. ప్రస్తుతం సలార్, ప్రాజెక్టు కె చిత్రాలతో బిజీగా ఉన్న డార్లింగ్ మరికొన్ని చిత్రాలకు కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ రెండు చిత్రాలు కంప్లీట్ అవ్వగానే డైరెక్టర్ మారుతితో ఓ సినిమా చేయనున్నారు. దీంతో హనురాఘవపూడి దర్శకత్వంలో ఓ లవ్ స్టోరీ చేసేందుకు ప్రభాస్ అంగీకరించినట్లు తెలుస్తోంది. తాజాగా మరో సినిమాకు కూడా ఓకే చెప్పారట ఈ మిస్టర్ ఫరెఫెక్ట్.
లేటెస్ట్ సమాచారం ప్రకారం, మలయాళీ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందబోయే ఈ సినిమా గురించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అలాగే నటీనటులను సైతం ఫైనల్ చేసే అవకాశం ఉందని టాక్. ప్రభాస్, పృథ్వీరాజ్ కలిసి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్'(Salaar movie) సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్, జగపతిబాబు తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబరు 28న రిలీజ్ చేయనున్నారు.
మరోవైపు ప్రభాస్ నాగ్ ఆశ్విన్ దర్శకత్వంలో 'కల్కి 2898 AD' చేస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఈ చిత్ర గ్లింప్స్ రికార్డులన్నింటినీ బద్దలుకొడుతుంది. ఈ చిత్రంలో దీపికా పదుకొనే(Deepika Padukone), కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan), దిశా పటానీ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సి. ఆశ్వినీదత్ సుమారు రూ.600 కోట్ల వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Also Read: Bhairava dweepam: రీరిలీజ్ కు రెడీ అయిన బాలయ్య 'భైరవ ద్వీపం'.. ఈ సారి 4Kలో..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook