Bro Movie: 'కిల్లీ కిల్లీ' సాంగ్‌ కొత్త వెర్షన్‌ వచ్చేసింది.. మామాల్లుళ్లతో అదిరిపోయే స్టెప్పులేసిన థమన్‌..

Bro Pre release event: పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన చిత్రం బ్రో. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో 'గుడుంబా శంకర్' చిత్రంలోని కిల్లి కిల్లి సాంగ్ యెుక్క న్యూ వెర్షన్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో పవన్, తేజ్, తమన్ తమ స్టెప్పులతో ఇరగదీశారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 26, 2023, 02:35 PM IST
Bro Movie: 'కిల్లీ కిల్లీ' సాంగ్‌ కొత్త వెర్షన్‌ వచ్చేసింది.. మామాల్లుళ్లతో అదిరిపోయే స్టెప్పులేసిన థమన్‌..

Killi Killi Song Promo: పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan), సుప్రీం హీరో సాయి ధరమ్‌ తేజ్‌ నటించిన 'బ్రో'(Bro) సినిమా రిలీజ్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఈ మూవీ జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.  నిన్న అంటే జూలై 25న ప్రీ రిలీజ్ ఈవెంట్  గ్రాండ్‌గా జరిగింది. ఆ వేడుకలో ఫ్యాన్స్ ను సర్‌ప్రైజ్‌ చేస్తూ మరో వీడియోను విడుదల చేశారు మేకర్స్. పవర్ స్టార్ 'గుడుంబా శంకర్' చిత్రంలోని సూపర్ హిట్ సాంగ్ 'కిల్లీ కిల్లీ' (Killi Killi Song Promo) కొత్త వెర్షన్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇందులో పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ తోపాటు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా స్టెప్పులేసి అలరించాడు. సుమారు 42 సెకన్ల ఉన్న ఈ వీడియో మెగా ఫ్యాన్స్ ను తెగ ఆకట్టుకుంటోంది. 

ప్రస్తుతం ఈ సాంగ్ ప్రోమో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో మెగా ఫ్యాన్స్ సంబంరాలు చేసుకుంటున్నారు. ఇందులో పవన్ వింటేజ్ లుక్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాకు యాక్టర్ కమ్ డైరెక్టర్ సముద్రఖని దర్శకత్వం వహించారు. వినోదయ సిత్తం అనే తమిళ సినిమాకు రీమేక్ గా ఇది తెరకెక్కింది. ఇందులో కేతిక శర్మ, ప్రియాంకా వారియర్‌ హీరోయిన్లుగా నటించారు.  ఈ మూవీని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీపై విశ్వప్రసాద్‌ నిర్మించారు. ఎస్ఎస్ థమన్ సంగీతం అందించారు. ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందించారు. ఇప్పటికే రిలీజైన టీజర్లు, సాంగ్స్‌, ట్రైలర్‌ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఈ మూవీ మరో బ్లాక్ బాస్టర్ అవ్వడం పక్కా అంటున్నారు ట్రేడ్ పండితులు.

Also Read: Bhairava dweepam: రీరిలీజ్ కు రెడీ అయిన బాలయ్య 'భైరవ ద్వీపం'.. ఈ సారి 4Kలో..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu   

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News