Prabhas: ప్రభాస్ నెక్ట్స్ బాలీవుడ్ మూవీ ఇదేనా ?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ( Prabhas ) తన తదుపరి పాన్-ఇండియా చిత్రంపై ఈ రోజు సాయంత్రం ఓ ఆసక్తికరమైన అప్‌డేట్ ఇచ్చాడు. ప్రముఖ బాలీవుడ్ ఫిలింమేకర్, తన్హాజీ దర్శకుడు ఓం రావుత్‌తో ( Om Raut ) కలిసి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక చిన్న వీడియోను విడుదల చేశాడు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ( Prabhas ) తన తదుపరి పాన్-ఇండియా చిత్రంపై ఈ రోజు సాయంత్రం ఓ ఆసక్తికరమైన అప్‌డేట్ ఇచ్చాడు. ప్రముఖ బాలీవుడ్ ఫిలింమేకర్, తన్హాజీ దర్శకుడు ఓం రావుత్‌తో ( Om Raut ) కలిసి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక చిన్న వీడియోను విడుదల చేశాడు. ప్రభాస్ ఆర్ యూ రెడీ అంటూ ఓం రావుత్ అడగ్గా... యస్ .. విత్ ఫింగర్స్ క్రాసింగ్ అంటూ ప్రభాస్ సమాధానం ఇచ్చిన తీరు చూస్తోంటే... వీళ్లిద్దరి మధ్య సినిమా సెట్ అయినట్టే కనిపిస్తోంది. రేపు ఉదయం 7.11 గంటలకు ఆ సస్పెన్స్ ఏంటో రివీల్ కానుంది. ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో ఇతర వివరాలు ఏవీ వెల్లడించనప్పటికీ... ఆ పోస్టులో ప్రస్తావించిన పేర్ల ఆధారంగా చూస్తే... ఓం రావత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా టి-సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్ ఓ సినిమా నిర్మించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. Also read : మహేష్ బాబు మేనల్లుడి సినిమా నుండి హీరోయిన్ ఫస్ట్ లుక్
ప్రభాస్ మొదటి బాలీవుడ్ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్‌ని బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్‌తో ( Hrithik Roshan ) కలిసి మల్టీస్టారర్ చేయబోతున్నట్లు పుకార్లు వచ్చాయి. ఇప్పుడు, ప్రభాస్, తన్హాజీ దర్శకుడు ఓం రావత్ కలిసి ఈ అనౌన్స్‌మెంట్ చేయడంతో మల్టీస్టారర్‌పై ఊహాగానాలు నిజమేనా అనే సందేహం కలుగుతోంది. ప్రస్తుతానికి, రేపు ఉదయం ప్రభాస్, ఓం రావత్ నుండి ఏం అనౌన్స్‌మెంట్ రాబోతుందో వేచి చూడాల్సిందే. Also read : Kajal Aggarwal: కాజల్ ఎంగేజ్‌మెంట్ వార్తల్లో నిజమెంత ?