Pradeep Machiraju 30 Rojullo Preminchadam Ela Tailer out: బుల్లితెర మీద రాణించిన స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు చేస్తున్న ప్రయత్నం ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’. ఈ సినిమాతో టాలీవుడ్‌కు హీరోగా పరిచయం అవుతున్నాడు ప్రదీప్. కరోనా కారణంగా వాయిదా పడిందని తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’ మూవీ ట్రైలర్ విడుదలైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తు్న్న ట్రైలర్ రావడంతో భారీగా వ్యూస్ వస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


లహరి మ్యూజిక్ నుంచి మూవీ ట్రైలర్ విడుదల చేయగా సూపర్ రెస్పాన్స్ వస్తోంది. క్వచ్చన్ పేపర్ ఇవ్వకముందే ఆన్సర్లు రాయడం.. బాగా ఆడే వాడికి పిచ్‌తో పనిలేదు.. బాగా రాసే వాడికి క్వచ్చన్ పేపర్‌తో పని లేదని  హీరో ప్రదీప్ మాచిరాజు(Pradeep Machiraju) చెప్పే టైమింగ్ డైలాగ్ ఆకట్టుకుంది. ట్రైలర్ చూస్తూ మూవీపై అంచనాలు పెరగడం ఖాయం. మరోవైపు రెండు జన్మల కథలా ఓసారి విలేజ్ బ్యాక్‌డ్రాప్, తర్వాత లేటస్ట్ టైమ్‌లో నడిచినట్లు రెండు వేరియేషన్లు చూపించారు.


Also Read: Chinki Minki Photos: వారెవ్వా.. ఒక్క ఫ్రేమ్‌లో డబుల్ అందాలు


 



(Video Credit: Youtube/ Lahari Music | T - Seies)



టాలీవుడ్(Tollywood) ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌కు చెందిన గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ సంస్థలు ఈ సినిమాను తీసుకొస్తున్నాయి. ఈ సినిమాలో ప్రదీప్ సరసన నటి అమృతా అయ్యర్ కథానాయికగా నటించింది. జనవరి 29న ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’ సినిమా విడుదల కానుంది. కరోనా వైరస్, లాక్‌డౌన్ సమయంలో ఎక్కడ విన్నా ఈ సినిమాలోని నీలి నీలి ఆకాశం పాటనే అని తెలిసిందే.


Also Read: Pradeep Machiraju: యాంకర్ ప్రదీప్ తొలి మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.. 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook