Pragya Jaiswal Bikini Treat ప్రగ్యా జైస్వాల్‌కు తెలుగులో ఇప్పుడు అవకాశాలు లేకుండా పోయాయి. ఆమె ఖాతాలో హిట్టు పడ్డా కూడా ఆమెను ఎంపిక చేసుకునే దర్శక నిర్మాతలు లేకుండా పోయారు. బాలయ్య, బోయపాటి సినిమాల్లో తప్పా ఆమె మరేతర ప్రాజెక్టుల్లో నటించడం లేదు. ఆమెను ఎవ్వరూ ఎంపిక చేసుకోవడం లేదు. బాలయ్య, బోయపాటి కాంబోలో వచ్చిన అఖండ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. కానీ అందులో ఆమెకు వచ్చిన క్రెడిట్ శూన్యం. ఆ హిట్ క్రెడిట్ అంతా కూడా బాలయ్య, బోయపాటి ఖాతాల్లోకే వెళ్లింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలా ప్రగ్యా జైస్వాల్ చివరకు బాలయ్య భామగానో, బోయపాటి సినిమాల్లో హీరోయిన్‌గానో అనే ముద్రతోనే ఉంటోంది. ఆమె ఖాతాలో క్రిష్ తెరకెక్కించిన కంచె సినిమా మాత్రమే హిట్టుగా నిలిచింది. క్రెడిట్ దక్కింది. ఆ తరువాత మళ్లీ ప్రగ్యా జైస్వాల్‌ ఖాతాలో క్రెడిట్ ఇచ్చిన సినిమా రానే లేదు. అందుకే ప్రగ్యా జైస్వాల్ ఎక్కువగా సోషల్ మీడియాలో ఉంటుంది.


ప్రగ్యా జైస్వాల్ ఎక్కువగా వెకేషన్స్‌లో ఉంటుంది. బికినీలోనే దర్శనమిస్తుంటుంది. అవకాశాల కోసమే ఇలా చేస్తుంటుందని నెటిజన్లు కామెంట్లు పెడుతుంటారు. అయితే తాజాగా మరోసారి బికినీలో కనిపించింది ప్రగ్యా జైస్వాల్. ఈ సారి ప్రగ్యా బికినీ అందాల గురించి కాకుండా ఆ ఫోటోల్లో వెనకాల ఉన్న మనషులు, వారు చేస్తున్న పనుల మీద జనాలు ఎక్కువగా ఫోకస్ పెట్టేశారు.


[[{"fid":"264198","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


ఎక్కడో ఫారిన్ కంట్రీలో ఇలా బికినీ పోజులు పెట్టినట్టుగా కనిపిస్తోంది. ఇక వెనకాల సరిగ్గా కనిపిస్తే వివిధ రకాల భంగిమలతో అక్కడి జనాలు కనిపిస్తున్నారు. దీంతో నెటిజన్లు ప్రగ్యా అందాల గురించి కాకుండా.. వెనకాల ఉన్న ఆ రకరకాల మనుషులు, వారి వారి భంగిమల గురించి కామెంట్లు పెడుతున్నారు. దీంతో ప్రగ్యా కష్టం అంతా వృథా అయినట్టుగా కనిపిస్తోంది.


ఇప్పుడు ప్రగ్యా చేతిలో ఏ ఒక్క తెలుగు ప్రాజెక్ట్ లేనట్టుగా కనిపిస్తోంది. బాలీవుడ్‌లోనూ ఈ భామ సినిమాలు చేసింది. కానీ అక్కడా కూడా ఏమీ వర్కౌట్ అవ్వలేదు. మరి ఇలా బికినీ అందాలు చేసి ఎవరైనా ప్రగ్యాకు అవకాశాలిస్తారేమో చూడాలి.


Also Read:  Balagam Movie Review : బలగం మూవీ రివ్యూ.. తెలంగాణకు అద్దం పట్టేలా


Also Read: Amala Akkineni : కుక్కల మీద అలాంటి కామెంట్లు చేసిందా?.. అమల నిజంగానే అలా అనేసిందా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook