Prakash Raj Supports Sai Pallavi : విరాటపర్వం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సాయి పల్లవి చేసిన కొన్ని కామెంట్స్ పెను దుమారానికి దారి తీసిన సంగతి తెలిసిందే. సరిగ్గా సినిమా విదులకు కొద్ది రోజుల ముందు సాయి పల్లవి మాట్లాడుతూ కాశ్మీర్ ఫైల్స్ లో చూపించిన డానికి,  ఇప్పుడు ఆవులను తీసుకుని వెళుతున్న ముస్లిం డ్రైవర్లను పట్టుకుని జైశ్రీ రాం అనిపించడం రెండూ ఒకటే అని కామెంట్ చేసింది. మనం మంచి వ్యక్తులగా ఉండాలని ఆమె చెప్పుకొచ్చింది. ఈ దెబ్బకు సాయి పల్లవి గో రక్షకులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారంటూ భజరంగ్ దళ్ కార్యకర్తలు ఆమె మీద పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సోషల్ మీడియాలో కూడా నెటిజన్లు రెండుగా విడిపోయి కొంతమంది ఆమెను తీవ్రంగా వ్యతిరేకించి విమర్శలు చేయగా.. ఇంకొంత మంది ఆమెకు మద్దతుగా నిలిచారు. అయితే,  తాజాగా సాయి పల్లవి ఆ వివాదంపై స్పందిస్తూ ఒక వీడియో కూడా విడుదల చేశారు. తాను తన జీవితంలో మొట్టమొదటిసారి ఇలా ఓ అంశంపై తాను వివరణ ఇస్తున్నానని ఆమె చెప్పుకొచ్చింది. తన వ్యాఖ్యలను కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారని.. చివరకు పేరొందిన మీడియా సంస్థలు సైతం తన వ్యాఖ్యలను పూర్తిగా వినకుండా తమకు తోచింది రాసుకుపోయాయని సాయి పల్లవి వీడియోలో ఆవేదన వ్యక్తం చేసింది. 


తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి తనపై చేసిన ఆరోపణల కారణంగా గత కొద్దిరోజులుగా తాను మానసికంగా ఎంతో క్షోభకు గురయ్యాయనని కూడా ఆమె చెప్పుకొచ్చారు.  అయితే ఇప్పటి వరకు సినీ పరిశ్రమ నుంచి ఆమెకు మద్దతుగా ఎవరూ నిలబడలేదు కానీ ప్రకాష్ రాజ్ ఆమెకు మద్దతు ప్రకటించారు. ఆమె షేర్ చేసిన వీడియో ట్వీట్ ను రీ ట్వీట్ చేస్తూ హ్యుమానిటీ అన్నింటికంటే ముందు అని.. సాయిపల్లవి మేము నీతోనే ఉన్నామంటూ ఆయన మద్దతు పలికారు. అయితే ప్రకాష్ రాజ్ మద్దతు పలికిన విషయంలో కూడా నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. 


కొందరు ప్రకాష్ రాజ్ అండగా నిలవడం మంచిదేనని అంటుంటే,  మరికొందరు ప్రకాష్ రాజ్ మీద కూడా నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా మీద మరో కేసు కూడా నమోదయింది. ఈ సినిమాలో యువతను రెచ్చగొట్టే విధంగా కొన్ని సీన్స్ ఉన్నాయని,  పోలీసులను కించపరిచే సీన్స్ కూడా ఉండడంతో సినిమాను బ్యాన్ చేయాలని ఒక వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సినిమాలో నక్సలిజం,  టెర్రరిజం లాంటి వాటిని ప్రోత్సహించే విధంగా సీన్స్ ఉన్నాయని చెబుతూ సెన్సార్ చేసిన సెన్సార్ అధికారి షెఫాలీ కుమార్ మీద కూడా ఫిర్యాదు చేయడం చర్చనీయాంశం అయింది. 
Also Read: Pooja Hegde: మైండ్ బ్లాకయ్యే షాక్ ఇచ్చిన నిర్మాతలు.. అస్సలు ఊచించి ఉండదు!


Also Read: VirataParvam Day 2 Collections: మరింత డ్రాప్.. ఆ ఎఫెక్ట్ ఏనా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook