prakash raj supports Richa Chadha : ప్రకాష్‌ రాజ్‌ ఎప్పుడూ అందరి ఆలోచించేలా ఆలోచించడు. ప్రత్యేకంగా ఆలోచిస్తాడు. ప్రశ్నించేందుకు ముందుంటాడు. ప్రకాష్‌ రాజ్ ఎప్పుడూ కూడా కేంద్రాన్ని, ప్రధాని మోదీని వ్యతిరేకిస్తూ ట్వీట్లు వేస్తూనే ఉంటాడు. జస్ట్ ఆస్కింగ్ పేరిట ఎప్పుడూ కాంట్రవర్సీ క్రియేట్ అయ్యే ట్వీట్లు వేస్తుంటాడు. కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేసి దారుణంగా ఓడిపోయాడు. అయితే ప్రకాష్‌ రాజ్ మాత్రం తన ప్రశ్నించే పోరాటాన్ని మాత్రం ఆపడం లేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా ఆయన నటి రీచా చద్దాకు మద్దతుగా నిలిచాడు. ఆర్మీ అధికారి వేసిన ట్వీట్‌కు రీచా చద్దా కౌంటర్ వేయడం, అది కాస్త వివాదంగా మారడం అందరికీ తెలిసిందే. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను చేజిక్కించుకునేందుకు మేం సిద్దంగా ఉన్నామని ఆర్మీ అధికారి వేసిన ట్వీట్‌కు రీచా చద్దా స్పందిస్తూ.. అప్పుడు మనకు గాల్వాన్ హాయ్ చెబుతుందని సెటైర్ వేసింది. మనం పాక్‌ను ఆక్రమిస్తే.. చైనా వచ్చి మనల్ని ఆక్రమిస్తుందన్నట్టుగా కౌంటర్ వేసింది. గాల్వన్ లోయలో జరిగిన కాల్పుల్లో మన దేశ సైనికులు ఎందరో మృతి చెందిన సంగతి తెలిసిందే.


 



ఇలాంటి వాటి మీద ఎలా సెటైర్ వేయగలిగిందంటూ రీచా చద్దాను దేశ ప్రజలు చీ కొట్టేశారు. దీంతో అందరికీ సారీ చెప్పేసింది. ఆర్మీ విలువ, సైనికుల ప్రాణ త్యాగం గురించి తనకు తెలుసునని, తనది కూడా ఆర్మీ నేపథ్యం ఉన్న కుటుంబమేనని చెప్పుకొచ్చింది. అయితే రీచా చద్దా వ్యాఖ్యలను మాత్రం ప్రకాష్‌ రాజ్ సమర్థించాడు. రీచా చద్దాను తప్పుబడుతూ అక్షయ్ కుమార్ వేసిన ట్వీట్‌ మీద కూడా ప్రకాష్‌ రాజ్ సెటైర్ వేశాడు.


అక్షయ్ కుమార్ ఇలా ఆమెను తప్పుబడతారని అనుకోలేదంటూ ప్రకాష్ రాజ్ అన్నాడు. రీచా చద్దాకు నేను సపోర్ట్‌గా నిలుస్తున్నాను.. ఆమె ఏ ఉద్దేశ్యం ఏంటో నాకు తెలుసు అంటూ ప్రకాష్‌ రాజ్‌ మద్దతుగా నిలవడంతో నెటిజన్లు దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం గతంలో గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో మోడీ కూడా ఇలానే ఆర్మీ మీద చులకన భావంతో ట్వీట్లు వేశారంటూ నాటి ట్వీట్లను వైరల్ చేస్తున్నారు.


Also Read : Gruhalakshmi Serial Samrat : మిడ్ నైట్ సినిమా చూపించేశాడుగా.. బెడ్రూంలో ఇంద్రనీల్ గోల.. తలపట్టేసుకున్న భార్య


Also Read : Mahesh Babu Hair: తల్లిదండ్రులు మరణించినా మహేష్ బాబు తలనీలాలు తీయని మహేష్.. బాధ్యత లేక కాదు అసలు కారణం ఇది!


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook