Pramod roped in Salaar Movie: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ అనేక సినిమాలను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. ఆ అన్ని సినిమాల్లోనూ ఆసక్తి రేకెత్తిస్తున్న కాంబినేషన్ ప్రభాస్ - ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఆయన చేస్తున్న సలార్ సినిమా. కేజిఎఫ్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ తో కలిసి సలార్ అనే సినిమా చేస్తున్నారు. హోంబలే ఫిలింస్ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సలార్ అనే పాత్రలో నటిస్తుండగా పృథ్వీరాజ్ సుకుమారన్ వరదరాజ మన్నార్ అనే పాత్రలో నటిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శృతిహాసన్ ఆధ్యా అనే హీరోయిన్ పాత్రలో జగపతిబాబు రాజమన్నార్ అనే ఒక పాత్రలో కనిపిస్తున్నారు. ఇక వీరు  ఈశ్వరి రావు, విశాల్ వదిన శ్రేయ రెడ్డి ఇతర కీలక పాత్రలలో కనిపిస్తున్నారు. ఈ సలార్ సినిమాకు కేజిఎఫ్ సంగీత దర్శకుడు రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా ఈ సినిమాకు కేజీఎఫ్ ఎడిటర్ ఉజ్వల్ కులకర్ణి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక ఈ సినిమా 28 సెప్టెంబర్ సెప్టెంబర్ 2023వ సంవత్సరంలో విడుదల చేసి ఎందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.


సుమారుగా 200 కోట్ల రూపాయలు బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మరో కన్నడ యాక్టర్ ని తీసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ప్రస్తుతం ఉన్న టెక్నికల్ టీం అంతా కన్నడ కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారే అయినా నటీనటులు అందరూ తెలుగు, తమిళ, మలయాళ భాషలకు చెందిన వారు అధికంగా ఉన్నారు. అయితే తన రాష్ట్రంలో కూడా సినిమాని పెద్ద ఎత్తున విడుదల చేయాలని భావిస్తున్న ప్రశాంత్ నీల్ కన్నడ నటుడు ప్రమోద్ ను ఒక కీలక పాత్ర కోసం ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది.


గీత బ్యాంగిల్ స్టోర్ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి తర్వాత ప్రీమియర్ పద్మిని, మట్టే ఉద్భవ అనే కన్నడ సినిమాలతో ప్రమోద్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక గత ఏడాది ఆయన నటించిన రత్న ప్రపంచ అనే సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో ఉడాల్ బాబురావు అనే పాత్రలో ప్రమోద్ ఆకట్టుకున్నాడు. ఇక అంతకుముందు ఆయన పలు సీరియల్స్ లో కూడా నటించారు. అయితే  ప్రభాస్ సినిమాలో ఒక కన్నడ స్టార్ నటించబోతున్నాడు అనే విషయం తెలియడంతో పలు భిన్నమైన స్పందనలు వ్యక్తం అవుతున్నాయి. 


Also Read: Tragedy at Vishnupriya home: నటి విష్ణుప్రియ ఇంట తీవ్ర విషాదం.. ఆవేదన వ్యక్తం చేస్తూ పోస్ట్!


Also Read: Ram Charan Buchi Babu Movie: ఎన్టీఆర్ వద్దనుకున్న కథను ఫైనల్ చేసిన రామ్ చరణ్?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook