Pranita Subhash Latest pics : హీరోయిన్ ప్రణీతకు ప్రస్తుతం మంచి ఇమేజ్ ఉంది. ప్రణీత సుభాష్ కన్నడ సుందరి అయినా కూడా తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకుంది. హీరోయిన్‌గా ఇక్కడే గుర్తింపు వచ్చింది. సక్సెస్ కూడా మొదటగా ఇక్కడే వచ్చింది. అయితే ప్రణీతకు మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ సొంతంగా రాలేదు. ఆమె కెరీర్లో అత్తారింటికి దారేది సినిమాయే బ్లాక్ బస్టర్ హిట్. కానీ దాని క్రెడిట్ మాత్రం ఆమెకు రాలేదు. ఎందుకు అంటే అందులో ఆమె సెకండ్ హీరోయిన్‌గా నటించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"248263","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


సినిమాల సంగతి ఎలా ఉన్నా, సినీ కెరీర్ ఎలా ఉన్నా కూడా ప్రణీతకు ఇప్పుడు మంచి క్రేజ్ ఉంది. కరోనా సమయంలో ఆమెకు మంచి పాపులారిటీ దక్కింది. హీరోయిన్లంతా కూడా ఇంట్లో ఖాళీగా తింటూ, పడుకుంటూ, ఆటలు ఆడుకుంటూ ఉంటే.. ప్రణీత మాత్రం సాధారణ జనాల కోసం రోడ్డు మీదకు వచ్చింది. 


[[{"fid":"248264","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


సీసీసీ అని చిరంజీవి పెడితే.. దానికి లక్ష రూపాయాల విరాళం ఇచ్చింది. ఫుడ్ లేకుండా బాధపడ్డ ఎంతో మందికి అన్నదానం చేసింది. నిత్యం ఫుడ్ పాకెట్ల పంపిణీతో ప్రణీత ఎంతో మంది ఆకలి తీర్చేస్తుండేది. అలా ప్రణీతకు సోషల్ మీడియాలో మంచి క్రేజ్, ఫాలోయింగ్ ఏర్పడింది. ఆమె మీద అందరికీ ఫుల్ పాజిటివ్ ఇమేజ్ వచ్చేసింది.


[[{"fid":"248265","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]


ప్రణీత పైగా ప్రస్తుతం హిందుత్వం మీద ఎక్కువగా స్పందిస్తుంటుంది. హిందువుల మీద జరిగే అల్లర్లు, ప్రభుత్వం వ్యవహరించే తీరు మీద ఫైర్ అవుతుంటుంది. ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా సమయంలోనూ ప్రణీత ఎక్కువగా స్పందించింది.  ఈ చిత్రం చూసి చలించిపోయాను అంటూ ఎమోషనల్ ట్వీట్ వేసింది. సాయి పల్లవి చేసిన కామెంట్ల మీద కూడా సెటైర్లువేసింది.


[[{"fid":"248266","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"4":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"4"}}]]


ప్రణీత పెళ్లి చేసుకోవడం, తల్లి అవ్వడం ఇలా అన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన టాపిక్స్. అయితే ప్రణీత పెళ్లి విషయం మాత్రం ఒక్కసారిగా బయటకు వచ్చింది. ఫోటోలు వైరల్ అవ్వడంతో.. సోషల్ మీడియాలో ప్రణీత స్పందించింది. తన పెళ్లి జరిగిందని ప్రకటించేసింది. కరోనా వల్ల తక్కువ మంది అతిథుల సమక్షంలో పెళ్లి చేసుకున్నానని చెప్పేసింది.


[[{"fid":"248267","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"5":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"5"}}]]


ప్రస్తుతం ప్రణీత సిల్వర్ స్క్రీన్ మీద ఫోకస్ పెట్టినట్టు కనిపించడం లేదు. తెలుగులో ఒక్క ప్రాజెక్ట్‌లో కూడా ఆమెను తీసుకున్నట్టుగా కనిపించడం లేదు. కానీ కన్నడలో మాత్రం ప్రణీతకు అడపాదడపా ఆఫర్లు వస్తున్నట్టు కనిపిస్తోంది. తల్లి అయిన తరువాత కూడా ప్రణీత అందాల ఆరబోతలో వెనక్కి తగ్గడం లేదు. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు చూసి అంతా ఫిదా అవుతున్నారు.


Also Read : Manjula - Nirupam : డాక్టర్ బాబుకు మళ్లీ ఎంగేజ్మెంట్.. మంజుల నిరుపమ్ పిక్స్ వైరల్


Also Read : చిరంజీవికి గరికిపాటి క్షమాపణలు చెప్పలేదా.. ఆ పోస్టుకు అర్థమేంటి?


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook