Bollywood Ramayan: ఆ, కల్కి లాంటి సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ. కానీ ఈ దర్శకుడికి ఆ సినిమాలతో రాని పేరు హనుమాన్ చిత్రం తెచ్చిపెట్టింది. ఈ మధ్య విడుదలైన హనుమాన్ సినిమాతో ఏకంగా స్టార్ డైరెక్టర్ లిస్టులో చేరిపోయారు ఈ యంగ్ డైరెక్టర్. సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుంచి సూపర్ హిట్ టాక్ సొంతం సొంతం చేసుకుంటూ ప్రస్తుతానికి 150 కోట్ల కలెక్షన్స్ దాటేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ దర్శకుడు తన తదుపరి సినిమాలను అధికారికంగా ప్రకటించాడు. హనుమాన్ సినిమా సీక్వెల్ గా రాబోతున్న జై హనుమాన్ చిత్రం ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలుపెట్టాడు. సూపర్ మాన్.. సూపర్ ఉమెన్ సినిమాలు తీస్తాను అని క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్ వర్మ.. రామాయణం కూడా తాను తీయాలనుకుంటున్నానని ఈమధ్య జరిగిన ఒక బాలీవుడ్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.


బాలీవుడ్ మీడియాలో జరిగిన ఒక ఇంటర్వ్యూలో హిందీలో నితీష్ తివారి తీయబోతున్న రామాయణ సినిమా గురించి టాపిక్ చర్చకి వచ్చింది. నితీష్ రామాయణాన్ని మూడు భాగాలుగా తెరకెక్కించబోతున్నారని, అందులో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటించబోతున్నారంటూ చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి.


ఈ రామాయణం గురించి ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. “రామాయణ కథ మన జీవితాశైలిని సరైన దారిలో నడిచేలా చేస్తుంది. అందుకే ప్రతి జనరేషన్ కి రామాయణం కథ చెప్పాల్సిన అవసరం మనకి ఉంది. ఆ కథని చెప్పడంలో మనం చాలా పద్ధతిగా వ్యవహరించాలి. ఒకవేళ రామాయణం వాళ్ళు (నితీష్ తివారి) తియ్యకపోతే, నేను కచ్చితంగా చేస్తా” అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.


 



అంతేకాదు తాను మహాభారతం కూడా సినిమా తీయాలి అనుకున్నట్టు, అయితే దర్శకుడు రాజమౌళి మహాభారతం తన డ్రీం ప్రాజెక్ట్ గా పెట్టుకోవడంతో.. తాను మహాభారతం తీయాలనుకున్న నిర్ణయం విరమించుకున్నట్లు చెప్పుకొచ్చారు. రామాయణ మహాభారతాలు ఎన్నిసార్లు చూసినా.. విన్నా .. తీసే విధానంలో తీస్తే..ప్రేక్షకులకు బోర్ కొట్టదు కాబట్టి ప్రశాంత్ వర్మ కూడా ఫ్యూచర్లో ఈ ప్రాజెక్టులను తీస్తారేమో అన్న సందేహాలు ప్రస్తుతం అందరిలో మొదలయ్యాయి.


Read: Ayodhya Crown: అయోధ్య రాముడికి స్వర్ణ కిరీటం.. వజ్రాలు, విలువైన రాళ్లు పొదిగినది ఎన్ని కోట్లు అంటే?


Also Read: BRS Party MLAS Meet Revanth: బీఆర్‌ఎస్‌ పార్టీలో కలకలం.. సీఎం రేవంత్‌ను కలిసిన నలుగురు ఎమ్మెల్యేలు


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook