Mokshagna: నందమూరి మోక్షజ్ఞ పూర్తి పేరు తెలుసా? ఎన్టీఆర్ పేరు వచ్చేటట్టు..!
Nandamuri Mokshagna : చాలా కాలంగా నందమూరి అభిమానులు ఎదురు చూస్తున్నది బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ హీరోగా.. మారడం కోసం. వారి ఆశలు నిజం చేస్తూ మోక్షు ఇప్పుడు త్వరలో హీరోగా ఇండస్ట్రీ కి పరిచయం అవుతున్నాడు. అయితే.. ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న ప్రశాంత్ వర్మ ఇప్పుడు మోక్షజ్ఞ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ మోక్షజ్ఞ పూర్తి పేరు బయట పెట్టేశారు.
Nandamuri Mokshagna full name: చాలా కాలంగా నందమూరి బాలయ్య తనయుడు మోక్షజ్ఞ హీరోగా మారే రోజు కోసం నందమూరి ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఈ ఆశలకు శుభం కార్డు పలుకుతూ.. మోక్షజ్ఞ హీరోగా మారబోతున్నాడు. బాలకృష్ణ తన కొడుకు మోక్షజ్ఞ ని హీరోగా ఇండస్ట్రీ కి పరిచయం చేయబోతున్నారు. హను మ్యాన్ సినిమాతో ప్యాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అందుకున్న ప్రశాంత్ వర్మ స్వయంగా మొక్షు ని హీరోగా లాంచ్ చేయబోతున్నారు.
తాజాగా ఇవాళ మోక్షజ్ఞ పుట్టిన రోజు..సందర్భంగా అధికారికంగా మోక్షజ్ఞ మొదటి సినిమాని ప్రకటించారు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎస్ ఎల్ వీ సినిమాస్, లెజెండ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై సుధాకర్ చెరుకూరి, తేజస్విని నందమూరి నిర్మాణంలో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ హీరోగా ఒక సినిమాని ప్రకటించారు.
ఈ సందర్భంగా మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ కూడా విడుదల.. చేసేశారు. గతంతో పోల్చుకుంటే పోస్టర్ లో మోక్షజ్ఞ చాలా ఛేంజ్ అయిపోయాడు అని చెప్పుకోవచ్చు. సినిమా కోసం చాలా మోక్ష్యు చాలా బాగా మారాడు. దీంతో బాలయ్య తనయుడి లుక్ అదిరిపోయిందిగా అంటూ అభిమానులు బాగానే కామెంట్స్ చేస్తున్నారు. అయితే మోక్షజ్ఞ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ.. పోస్టర్ షేర్ చేసి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ పూర్తి పేరు కూడా బయట పెట్టేశారు.
"నందమూరి తారక రామ మోక్షజ్ఞ తేజకు పుట్టిన రోజు శుభాకాంక్షలు" అంటూ పూర్తిపేరు రాసుకొచ్చారు. దీంతో మోక్షజ్ఞ పేరులో తాతయ్య తారక రామ పేరు కూడా ఉండటంతో ఫ్యాన్స్ షాక్ అవ్వడమే కాక సంతోషం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇక మోక్షజ్ఞ డెబ్యూ సినిమాని బాలయ్య రెండో కూతురు తేజస్విని స్వయంగా నిర్మాతగా వ్యవరిస్తున్నారు.
మోక్షజ్ఞ డెబ్యూ సినిమా గురించి ఇప్పటికే సోషల్ మీడియాలో బోలెడు కథనాలు వినిపిస్తున్నాయి. మోక్షజ్ఞ లుక్ గురించి కూడా ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ త్వరగా విడుదల చేయాలి అని ఫ్యాన్స్ ప్రశాంత్ వర్మ ను తెగ ప్రశ్నిస్తున్నారు. ఈ సినిమా గురించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.
Also Read: Harish Rao: రేవంత్ రెడ్డి తాటాకు చప్పుళ్లకు భయపడం: హరీశ్ రావు స్ట్రాంగ్ వార్నింగ్
Also Read: KCR Donation: వరద బాధితులకు మాజీ సీఎం కేసీఆర్ విరాళం.. కేటీఆర్, కవితతో సహా అందరూ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter