Bhavai movie controversy: హీరో ప్రతీక్ గాంధీని అరెస్ట్ చేయాలంటున్న నెటిజన్స్! కారణం ఏంటంటే..
Bhavai: `భవాయి` చిత్ర వివాదం ఇప్పట్లో చల్లారలేదు. ఈ సినిమాలో మతపరమైన మనోభావాలు దెబ్బతీసేలా కొన్ని సన్నివేశాలున్నాయని..లీడ్ రోల్ లో నటించిన బాలీవుడ్ నటుడు ప్రతీక్ గాంధీని అరెస్ట్ చేయాలంటూ..పలువురు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.
Bhavai movie controversy: 'స్కామ్ 1992' వెబ్ సిరీస్‌లో హర్షద్ మెహతా(Harshad Mehta) పాత్రతో ఓవర్ నైట్ స్టార్‌గా మారాడు బాలీవుడ్ నటుడు ప్రతీక్ గాంధీ. తన నటనతో కోట్లాది అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు ప్రతీక్. ఆయన తాజాగా నటించిన చిత్రం భవాయ్. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసినప్పటీ నుంచి ఏదో ఒక కారణంతో సోషల్ మీడియా(Social Media)లో ట్రెండ్ అవుతూనే ఉంది. ఈ చిత్రం మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ సినిమాను నిషేధించాలనే డిమాండ్ ఊపుందుకుంది.
Also Read: Hero Vijay: తన తల్లిదండ్రులపైనే కేసు పెట్టిన హీరో విజయ్! ఎందుకో తెలుసా?
ప్రస్తుతం సోషల్ మీడియాను కుదిపేస్తున్న హ్యాష్ ట్యాగ్..#ArrestPratikGandhi. భవాయి సినిమాలో నటించిన గుజరాతీ నటుడు ప్రతీక్ గాంధీ(Pratik Gandhi)ని అరెస్ట్ చేయాలని సోషల్ మీడియాలో కొందరు పట్టుబడుతున్నారు. భవాయి(Bhavai).. ప్రతీక్ గాంధీ లీడ్ రోల్‌లో నటించిన కొత్త చిత్రం. అక్టోబర్ 1న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కావాల్సి ఉంది. ఈ సినిమాకు ముందుగా ‘రావణ్ లీలా’(Ravan Leela) అనే టైటిల్ పెట్టారు. అది కాస్త వివాదాస్పదం కావడంతో ‘భవాయి’గా మార్చేశారు. అయినా వివాదం చల్లారట్లేదు.
భవాయి అనేది గుజరాతీ జానపద నాటక కళ. ఈ కళ ఆధారంగా దర్శకుడు హర్ధిక్ గజ్జర్ ‘భవాయి’ అనే ప్రేమకథ తీశాడు. ఇందులో లీడ్ క్యారెక్టర్‌ల మధ్య లవ్ సీక్వెన్స్ చూపించే క్రమంలో.. మతపరమైన మనోభావాలు దెబ్బతీశారనేది కొందరి ప్రధాన అభ్యంతరం. అందుకే ప్రధాన పాత్ర పోషించిన ప్రతీక్(Pratik Gandhi)ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక కొందరైతే గతంలో మహారాష్ట్రలో నిషేధానికి గురైన ఓ సినిమా ప్రస్తావన తీసుకొస్తూ.. ఇప్పుడూ అదే పని చేయాలంటూ కేంద్రాన్ని కోరుతున్నారు. ఓపక్క దక్షిణాది సినీ పరిశ్రమ మంచి మంచి సినిమాలతో భారత సినీ ఖ్యాతిని ఎక్కడికో తీసుకెళ్తుంటే.. బాలీవుడ్ మాత్రం కావాలనే మత సెంటిమెంట్‌ను దెబ్బతీసేలా సినిమాలు తీస్తూ దిగజారి పోతోందంటూ కామెంట్లు చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook