Hero Vijay: తమిళ హీరో విజయ్ తన తల్లిదండ్రులతో సహా 11 మందిపై చెన్నై సివిల్ కోర్టులో ఆదివారం కేసు పెట్టారు. అనుమతి లేకుండా తన పేరు వాడుతున్నారంటూ..విజయ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక ముందూ తన పేరుతో ఎలాంటి కార్యక్రమాలు, మీటింగ్స్ నిర్వహించకుండా ఉండేందుకే విజయ్ (Hero Vijay) ఈ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. సెప్టెంబరు 27న దీనిపై విచారణ జరగనుంది.
ఏడాది క్రితం విజయ్ తండ్రి, ప్రముఖ దర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్(SA Chandrasekhar).. ‘ఆల్ ఇండియా తళపతి విజయ్ మక్కల్ ఇయ్యకమ్’ పేరుతో రాజకీయ పార్టీ స్థాపించారు. దీనికి ఆయన జనరల్ సెక్రటరీగా, శోభా చంద్రశేఖర్ కోశాధికారిగా ఉన్నారు. పార్టీ పెట్టిన కొన్నిరోజులకే విజయ్ వైపు నుంచి ఓ ప్రకటన వచ్చింది. “మా నాన్న పెట్టిన పార్టీతో నేరుగా, పరోక్షంగా గానీ నాకు సంబంధం లేదు. మా నాన్న పార్టీ పెట్టారని నా ఫ్యాన్స్ ఎవరూ అందులో చేరొద్దు” అని విజయ్ తన నోట్లో పేర్కొన్నారు. పార్టీ కోసం తన పేరు, ఫొటో, ఫ్యాన్స్ క్లబ్‌ను గానీ దుర్వినియోగం చేసేందుకు ప్రయత్నిస్తే వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటానని కూడా విజయ్ తెలిపారు.
Also Read: SIIMA-2021 Awards : హైదరాబాద్‌లో ‘'సైమా'’ హంగామా..మహేష్ సినిమాదే పైచేయి..
విదేశీ కారుకు టాక్స్ కట్టిన దళపతి
అయితే విదేశీ కారు కొనుగోలు చేసి పన్ను(Tax) చెల్లించకపోవడం పట్ల కోర్టుతో అక్షింతలు వేయించుకున్న విజయ్ ఎట్టకేలకు పన్ను కట్టారు. తన రోల్స్ రాయిస్ ఘోస్ట్ (Rolls Royce Ghost)కారుకు సంబంధించి రూ.40 లక్షల పన్ను చెల్లించాడు. విజయ్ గవర్నమెంట్ కు పన్ను చెల్లించిన విషయాన్ని రాష్ట్ర అధికారులు మద్రాస్ హైకోర్టుకు తెలియజేశారు. విజయ్ విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న కారుకు పన్ను మినహాయింపు కోరుతూ 2012లో కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణలో ఇటీవల మద్రాస్ హైకోర్టు(Madras High Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. లక్ష రూపాయల ఫైన్ కట్టాలని, ఆ మొత్తాన్ని తమిళనాడు సీఎం కొవిడ్ రిలీఫ్ ఫండ్ కు అందజేయాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో జరిమానాతో పాటు, కారుకు చెల్లించాల్సిన మొత్తం పన్ను రూ.40 లక్షలను కూడా విజయ్ చెల్లించినట్టు ప్రభుత్వ వర్గాలు కోర్టుకు తెలిపాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook