Prithviraj In Salaar:సినీ ప్రేక్షకులు అందరూ సలార్ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కే జి ఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్ ముఖ్యపాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం నుంచి విడుదలైన రెండు ట్రైలర్లో కూడా ప్రభాస్ కన్నా ఎక్కువ పృథ్వీరాజ్ కనిపించడం గమనర్హం. దీంతో రెండు భాగాలుగా రానున్న ఈ సినిమా మొదటి పార్ట్ లో ఎక్కువగా కథ పృథ్వీరాజ్ చుట్టూనే తిరగచ్చు అని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ హీరో ప్రస్తుతం ఈ సినిమా గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇద్దరి మధ్య ఉండే స్నేహబంధం కాన్సెప్ట్ పైన ఆడియన్స్ ముందుకు రాబోతున్న సలార్ సినిమాలో ప్రభాస్.. పృథ్వీరాజ్ స్నేహితులుగా కనిపించబోతున్నారు. అయితే ఈ సినిమాలో నటించేందుకు పృద్వి రాజ్ ముందుగా నో చెప్పారట. అవును మీరు విన్నది నిజమే. ప్రేక్షకులకు ఎన్నో అంచనాలు ఉందే సలార్ సినిమాని ముందుగా పృథ్వీరాజ్ ఒప్పుకోలేదట.


అసలు విషయానికి వస్తే సలార్ నిర్మిస్తున్న నిర్మాతలు కేరళ కి వెళ్లి పృథ్వీరాజ్ ని కలిసి సలార్ మూవీలోని పాత్ర గురించి చెప్పారట. దర్శకుడు ప్రశాంత్ అప్పుడు కేజీఎఫ్ 2 షూటింగ్ లో ఉండగా.. ఆయనని పిలిపించి మరి పృథ్వీరాజ్ కి కథ వినిపించారట. కానీ పృథ్వీరాజ్ అప్పటికే ఒక సినిమాకి కమిట్ అయ్యి ఉన్నారు. ఆ మూవీలో పాత్ర కోసం గడ్డం, జుట్టు గుబురుగా పెంచుకొని ఉన్నారట. అందుకే ఆ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి అయ్యేవరకు తాను మరో మూవీ చేయలేని, కావున సలార్ చేయడం కష్టమని.. తనకు కుదరదని చెప్పేశారట.


కానీ ఈ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ మాత్రం పృథ్వీరాజ్ కోసం ఎదురు చూస్తాము అని చెప్పారట. దీంతో పృథ్వీరాజ్ డేట్స్ కోసం సలార్ మూవీ టీం వెయిట్ చేసిందట. 


ప్రస్తుతం సలార్ ప్రమోషన్స్ లో యాక్టివ్ గా పాల్గొంటున్న పృథ్వీరాజ్ ఈ విషయాన్ని మీడియా వారితో పంచుకున్నారు. కాగా ఈ మూవీ ఫస్ట్ పార్ట్ సీజ్ ఫైర్ డిసెంబర్ 22న రిలీజ్ కాబోతుంది. అయితే ఈ చిత్రం ప్రమోషన్స్ జోరు మాత్రం ఇంకా పెంచలేదు సినిమా యూనిట్. మరి ప్రభాస్ కి ఈ సినిమా బ్లాక్ బస్టర్ అందిస్తుందో లేదో తెలియాలి అంటే 22 వరకు వెయిట్ చేసి చూడాలి.


Also Read: Google Trend Video: వీడు మగాడ్రా బుజ్జి..ఏకంగా 16 అడుగుల కింగ్ కోబ్రాకు ముద్దు పెట్టాడు..మీరే చూడండి..


Also Read: Tamil Nadu Road Accident: తమిళనాడులో కారు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ అయ్యప్ప భక్తులు మృతి   



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి