Save The Tiger Trailer ఇప్పుడు చిన్న సినిమాలు, కొత్త కాన్సెప్ట్‌తో వచ్చే చిత్రాలు బాగానే ఆడుతున్నాయి. ప్రియదర్శి హీరోగా వచ్చిన బలగం సినిమా తెలంగాణలో సెన్సేషన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఈ సినిమా తెలంగాణలో ఏదో ఒక మూల ఆడుతోంది. ఊరంతా కలిసి బలగం సినిమాను చూస్తున్నారు. అలా బలగం సినిమాతో మెప్పించిన ప్రియదర్శి.. ఇప్పుడు ఇంకో కొత్త ప్రాజెక్ట్‌తో ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీగా ఉన్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మల్లేశం సినిమా తరువాత జాతి రత్నాలు.. ఆ సినిమా తరువాత ఇప్పుడు బలగం సినిమాతో ప్రియదర్శి ఎక్కువగా ట్రెండింగ్‌లోకి వచ్చాడు. అయితే ఇప్పుడు ప్రియదర్శి మాత్రం సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నాడు. సేవ్ ది టైగర్స్ అంటూ కొత్త ప్రాజెక్ట్‌తో ప్రేక్షకులను నవ్వించేందుకు రెడీగా ఉన్నాడు.


ఇక ఈ ట్రైలర్ చూస్తుంటే జాతి రత్నాలు స్టైల్లోనే నవ్వించేలా కనిపిస్తోంది. అభినవ్ గోమటం, చైతన్య, ప్రియదర్శి ఇలా ముగ్గురూ భార్యల వల్ల పడ్డ కష్టాలను ఇందులో ఎంతో ఫన్నీగా చూపించినట్టు కనిపిస్తోంది. ఇక ఈ ట్రైలర్‌లో ప్రియదర్శి జోర్దార్ సుజాత జోడి నవ్వించేలానే కనిపిస్తోంది. అయితే ఈ వెబ్ సిరీస్ ఓటీటీలో రాబోతోంది.


Also Read:  Samantha : సమంత ఆంటీ ఇంకా రెండు రోజులే ఉంది!.. సామ్ రిప్లై ఇదే


సేవ్ ది టైగర్స్ అంటూ రాబోతోన్న ఈ వెబ్ సిరీస్ డిస్నీ హాట్ స్టార్‌లో ఏప్రిల్ 27 నుంచి అందుబాటులోకి రాబోతోంది. అయితే ఈ వెబ్ సిరీస్  లో రోహిణి, సద్దాం వంటి వారు కూడా నవ్వించేందుకు రెడీగా ఉన్నారు. అయితే ఓటీటీలో ఆడియెన్స్ బాగానే ఆకట్టుకునేలా ఉంది. మరో జాతిరత్నాలు అయ్యేలా ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.


 



ఇక ఇప్పుడు ప్రియదర్శికి మంచి ఆఫర్లు వస్తూ ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. హీరోగా సినిమాలు చేస్తూనే ముఖ్య పాత్రలున్న సినిమాల్లోనూ నటిస్తున్నాడు. రామ్ చరణ్‌ శంకర్ గేమ్ చేంజర్ సినిమాలో ప్రియదర్శి నటిస్తోన్న విషయం తెలిసిందే.


Also Read: Renu Desai : పవన్ కళ్యాణ్‌ ఎందుకు స్పందించడు?.. నిలదీసిన నెటిజన్.. రేణూ దేశాయ్ రిప్లై వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook