బాలీవుడ్ నటి  ప్రియాంక చోప్రా మళ్లీ వార్తల్లో నిలిచారు. ఫోర్బ్స్ ప్రకటించిన అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఏ యేడాది ఫోర్బ్స్ ప్రకటించిన 100 మంది శక్తిమంతమైన మహిళల జాబితాలో ప్రియాంక 97వ స్థానంలో నిలిచారు. సినీరంగంతో పాటు సేవారంగంలో కూడా ఎక్కువగా ప్రియాంక పాల్గొనడమే అందుకు కారణం.  ఫోర్బ్స్ శక్తివంతమైన మహిళల జాబితాలో భారత్‌కు చెందిన చందా కొచ్చార్, రోషిని నాదార్ మల్హోత్రా, కిరణ్ మజుందార్ షా, శోభనా భార్తియా వంటి మహిళా వ్యాపారవేత్తలు కూడా చోటు దక్కించుకున్నారు. అదేవిధంగా ఈ జాబితాలో మొదటి స్థానాన్ని జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కల్ సొంతం చేసుకున్నారు. ఆమె తర్వాత స్థానాల్లో బ్రిటన్ ప్రధాని థెరిసా మే, గేట్స్ ఫౌండేషన్ కోచైర్మన్ మిలిండా గేట్స్ ఉన్నారు.