హైదరాబాద్‌: బుల్లితెర నటి శ్రావణి కొండపల్లి ఆత్మహత్య కేసు (TV Actress Sravani Suicide Case)లో పోలీసులు ఇదివరకే నిందితులు సాయికృష్ణారెడ్డి, దేవరాజ్ రెడ్డిలను విచారించారు. తాజాగా మూడో నిందితుడు, టాలీవుడ్ నిర్మాత అశోక్‌రెడ్డి (RX 100 Producer Ashok Reddy) పోలీసులకు లొంగిపోయాడు. కేసులు పరిణామాలు గమనిస్తున్న ఆర్ఎక్స్ 100 నిర్మాత అశోక్‌రెడ్డి పంజాగుట్ట పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఏసీపీ తిరుపతన్న అశోక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. Actress Sravani Suicide Case: ‘ప్లీజ్ దేవా, నన్ను వదిలేయ్’.. దేవరాజ్‌ను వేడుకున్న నటి శ్రావణి, ఆడియో లీక్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం కరోనా వ్యాప్తి నేపథ్యంలో కోవిడ్19 పరీక్షల కోసం నిందితుడిని ఎస్సార్‌ నగర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం నిందితుడు అశోక్‌రెడ్డిని కోర్టులో హాజరు పరచనున్నారు. నటి శ్రావణితో నిర్మాత అశోక్ రెడ్డి తరచుగా ఫోన్లో సంప్రదింపులు జరిపేవాడు. ఇదివరకే వీరి సంభాషణ ఆడియో ఒకటి ఇటీవల వైరల్ అయింది. శ్రావణి ఆత్మహత్య కేసు (Actress Sravani Suicide Case)లో ఏ1 సాయికృష్ణారెడ్డి, ఏ3 దేవరాజ్‌ రెడ్డి పోలీసుల అదుపులో ఉండగా తాజాగా ఏ2 అశోక్ రెడ్డి లొంగిపోయాడు. Sravani Suicide Case: లొంగిపోయిన దేవరాజ్.. టాలీవుడ్ నిర్మాతను విచారించనున్న పోలీసులు 


నటి శ్రావణిని పెళ్లి చేసుకుంటామని ఏదో ఓ సందర్భంగా సాయికృష్ణారెడ్డి, దేవరాజ్‌ రెడ్డి మరియు అశోక్‌రెడ్డి మాటిచ్చారని పోలీసులు ఇటీవల వెల్లడించారు. తొలుత సాయితో పరిచయం, ఆపై దేవరాజ్ ఎంట్రీతో మరో ట్రాక్ మొదలైంది. ఏం చేయాలో అర్థం కాని సమయంలో నిర్మాత అశోక్‌రెడ్డితో పరిచయం.. మొత్తం తాను కోరుకున్న జీవితం దొరకక, మరోవైపు వేధింపులు తట్టుకోలేక క్షణికావేశంలో శ్రావణి ఆత్మహత్య చేసుకుందని, ఈ ముగ్గురు ఆమె మరణానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. Sravani Suicide Case: సాయికృష్ణారెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు


ఫొటో గ్యాలరీలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYeR