MB Foundation : మరో చిట్టి గుండెకు ఊపిరి పోసిన మహేష్ బాబు.. నమ్రతను ఆశ్రయించిన నిర్మాత నాగవంశీ
Mahesh Babu Foundation మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా వెయ్యి మందికి పైగా చిన్నారుల గుండెలకు ఊపిరిపోశారు. మహేష్ బాబు చేస్తోన్న ఈ సేవా కార్యక్రమాల ద్వారా అందరి మనసుల్లోనూ చోటు సంపాదించుకున్నాడు.
Mahesh Babu Foundation మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా వెయ్యికి పైగా మంది చిన్నారుల ప్రాణాలను కాపాడిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు స్థాపించిన ఈ ఫౌండేషన్ ద్వారా చిన్నారు గుండెలకు ఎంతో భరోసా వచ్చింది. చిన్న పిల్లల్లో ఎవరికైనా సరే గుండెకు సంబంధించిన సమస్యలు వస్తే మహేష్ బాబు ఫౌండేషన్ అండగా ఉంటుంది. రెయిన్ బో హాస్పిటల్, ఆంధ్ర హాస్పిటల్స్ వంటి వాటితో మహేష్ బాబు ఫౌండేషన్ కో ఆర్డినేట్ చేస్తుంటుంది.
అలా రెండు తెలుగు రాష్ట్రాల్లోని 1100 మందికిపైగా చిన్న పిల్లలకు హార్ట్ ఆపరేషన్ చేయించాడు మహేష్ బాబు. తాజాగా మరో గుండెకు ప్రాణం పోసింది మహేష్ బాబు ఫౌండేషన్. దాని వెనుకున్న కథను నిర్మాత నాగవంశీ చెప్పుకొచ్చాడు. కొన్ని వారాల క్రితం ఇది జరిగింది.. నా క్లోజ్ ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేశాడు.. ఓ పూర్ ఫ్యామిలీ ఉంది.. వాళ్లు తమ పాపకు గుండె ఆపరేషన్ చేయించాలని అనుకుంటున్నారు.. ఎంత ట్రై చేసినా డబ్బులు దొరకడం లేదు.. వాటి కోసం ఎంతో కష్టపడుతున్నారు.. ఎంబీ ఫౌండేషన్ ఎలా రీచ్ కావాలో చెప్పు.. కాస్త సాయం చేయమని అడిగాడు.
నేను వెంటనే ఆ కేస్ గురించి నమ్రత గారికి ఫోన్ చేసి చెప్పాను. ఆమె వెంటనే ఎంబీ ఫౌండేషన్‌కు సమాచారం ఇచ్చింది. ఆ పాప డీటైల్స్ తీసుకున్నారు. రెండు వారాల తరువాత నాకు వారి దగ్గరి నుంచి మెసెజ్ వచ్చింది. పాప క్షేమంగా ఉంది. ఆపరేషన్ చేశారు అని చెప్పారు. మహేష్ బాబు, నమ్రత గారికి మేం ఎప్పటికీ రుణ పడి ఉంటామని ఆ తల్లిదండ్రులు ఎమోషనల్ అయ్యారు.
ఆపదలో ఉన్న వారికి సాయం చేస్తే దేవుడిలా కనిపిస్తాం.. ఇప్పుడు మహేష్ బాబు గారు, నమ్రత గారు కూడా వారికి దేవుళ్లలానే కనిపిస్తున్నారు.. అదే మహేష్ బాబు గారి మంచితనం అంటూ నాగవంశీ వేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. మహేష్ బాబు త్రివిక్రమ్ చేస్తోన్న SSMB 28 సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక తన హీరో గొప్పదనం, మంచి మనసును నిర్మాత నాగవంశీ ఇలా అందరికీ మరోసారి తెలియజేశాడు.
Also Read: Prabhu Hospitalized : హాస్పిటల్‌లో చేరిన ప్రముఖ నటుడు ప్రభు.. కారణం ఏంటంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook