Kiran Abbavaram: వాళ్లు మనల్ని పట్టించుకోర.. కిరణ్ అబ్బవరంకి పాపులర్ నిర్మాత రిప్లై..
KA Collections: కిరణ్ అబ్బవరం హీరోగా చేసిన క సినిమా.. దీపావళి సందర్భంగా విడుదలై మంచి విజయం సాధించి సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాని కేవలం ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే విడుదల చేయటంపై.. ముఖ్యంగా తొమ్మిద రాష్ట్రాల్లో థియేటర్స్.. దక్కకపోవడంపై ఈ మధ్యనే కిరణ్ అపవరం కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.
SKN viral tweet : తమిళ హీరోలని మన తెలుగువారు.. సొంత హీరోల లాగా ఫీల్ అవుతారు అన్న విషయం తెలిసిందే. ఇక్కడ మన తెలుగు హీరోల సినిమాల ఎలా ఆదరిస్తామో.. తమిళ హీరో సినిమాలను కూడా తెలుగు రాష్ట్రాలలో అలానే ఆదరిస్తారు. అంతే కాదు మన తెలుగు రాష్ట్రాలలో.. పండగకి తమిళ హీరో వచ్చిన.. మన సినిమాలతో పాటు వారికి కూడా థియేటర్లు ఇస్తూ ఉంటాము.
అయితే తమిళనాడులో మాత్రం.. దీనికి విరుద్ధంగా జరుగుతూ ఉంటుంది. వారి సినిమాలు ఉన్నప్పుడు.. మన సినిమాలు విజయాలు సాధించిన.. పెద్దగా థియేటర్స్ ఇవ్వరు. తెలుగు స్టార్ హీరోలకే తమిళనాడులో థియేటర్లు దక్కడం.. చాలా అరుదుగా జరిగే సంఘటన. అలాంటిది ఇక చిన్న హీరోల పరిస్థితి చెప్పనవసరం లేదు. ఇప్పుడు ఇదే విషయాన్ని మరోసారి.. తెలియజేశారు కిరణ్ అబ్బవరం.
కిరణ్ అమ్మవరం క సినిమా తెలుగు రాష్ట్రాలలో మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే తమిళంలో అమరన్ సినిమా విడుదలై ఉండగా.. క తమిళ్ వర్షన్ ని వచ్చేవారం విరుదల చేసుకోమని తెలియజేశారు. అయితే క తెలుగు వర్షన్ అక్కడ కనీసం 5 లేదా 10 థియేటర్స్ లో అన్న వెయ్యండి అంటూ.. ఈ మధ్యనే క సక్సెస్ మీట్ లో.. తెలియజేశారు కిరణ్ అబ్బవరం.క చిత్రం మంచి విజయం సాధించడం వల్ల.. అక్కడ తెలుగు ప్రేక్షకులు అడుగుతున్నారని.. కాబట్టి చెన్నై ఇలాంటి సిటీలో అన్న ఒక ఐదు థియేటర్లు ఇస్తే బాగుండు అని కోరారు…
ఇప్పుడు ఈ విషయంపై బేబీ సినిమా నిర్మాత ఎస్కేఎన్ కూడా స్పందించారు. కిరణ్ వ్యాఖ్యలను షేర్ చేస్తూ నిర్మాత SKN.. కొంచెం ఘాటుగానే వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం వైరల్ అవుతోంది. SKN తన ట్విట్టర్లో కిరణ్ అబ్బవరం వీడియో షేర్ చేసి.. “మన తెలుగు సినిమా ఇండస్ట్రీ.. అన్ని భాషల సినిమాలను, హీరోలను మన సొంతం అని ఫీల్ అవుతాము. మనల్ని అలా ఫీల్ అవ్వడం పక్కనపెడితే.. తమిళంలో కనీసం మనల్ని పట్టించుకోరు . ఇది జీర్ణించుకోడానికి చాలా కష్టం,” అంటూ ట్వీట్ చేసారు. ఇక ఈ విషయంపై తెలుగు ప్రేక్షకులు ఒకలా.. తమిళ ప్రేక్షకులు ఒకలా స్పందిస్తున్నారు.
Also Read: Trump vs Kamala Harris: అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఎవరు గెలిస్తే భారతీయులకు మేలు జరుగుతుంది..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.