Project K Shooting: రెబల్ స్టార్ ప్రభాస్, దీపికా పదుకొణె హీరోహీరోయిన్లుగా (Prabhas Deepika Padukone) నటిస్తున్న చిత్రం ‘ప్రాజెక్ట్-K’ (వర్కింగ్ టైటిల్). నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్ర షూటింగ్ (Project K Prabhas) ఇటీవలే ప్రారంభమైంది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. ఇప్పుడు హైదరాబాద్ లో జరగుతోన్న కీలక షెడ్యూల్ లో ప్రభాస్, దీపికా పదుకొణె పాల్గొన్నారు. వారిద్దరితో కలిసి తీసిన ఫస్ట్ షాట్ ను చిత్రబృందం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రభాస్, దీపికా పదుకొణె ఫస్ట్ షాట్ లో భాగంగా వారిద్దరి చేతులు కలుస్తున్నట్లు ఉంది. ఆ వీడియోను సోషల్ మీడియాలో మేకర్స్ రిలీజ్ చేశారు. “ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్, దీపికా పదుకొణె కలిసి వరల్డ్ బిగ్గెస్ట్ కెమెరా ముందు” అని హ్యాష్ ట్యాగ్ తో పంచుకున్నారు.



సైన్స్ ఫిక్షన్ కథతో తీస్తున్న ఈ సినిమాకు 'మహానటి' ఫేమ్ నాగ్​ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు. వైజయంతీ మూవీస్​ బ్యానర్​లో అశ్వనీదత్.. భారీ బడ్జెట్​తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో అమితాబ్ బచ్చన్ కీలకపాత్ర పోషిస్తున్నారు. 2023లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది.


ప్రభాస్, పూజా హెగ్డే కలిసి నటించిన ‘రాధేశ్యామ్’ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలయ్యేందుకు (Radhe Shyam Release Date) సిద్ధమైంది. ఈ నేపథ్యంలో సినిమా (Project K Prabhas) ప్రమోషన్స్ లో చిత్రబృందం జోరు పెంచింది. దీనితో పాటు 'రాధేశ్యామ్', 'సలార్', 'ఆదిపురుష్' సినిమాలు (Prabhas New Movies) చేస్తున్నారు ప్రభాస్. వీటి తర్వాత 'స్పిరిట్' చిత్రంలోనూ నటించనున్నారు.  


Also Read: Bigg Boss Telugu 5: ర్యాంకుల కోసం కంటెస్టెంట్ల మధ్య పోటీ..ఎవరికి ఏ పొజిషన్ దక్కిందంటే..


Also Read: Sara Alikhan-Vijay Deverakonda: 'విజయ్ చాలా హాట్...అతనితో సినిమా చేయాలనుంది'..: సారా అలీఖాన్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook