Rajasekhar Jeevitha: `రాజశేఖర్, జీవితలు మోసం చేశారు.. త్వరలోనే జైలుకు వెళతారు`
Garuda Vega movie producers filed cheating case against Rajasekhar. టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్, ఆయన సతీమణి జీవితపై జోస్టర్ ఫిలిం సర్వీసెస్ గ్రూప్ యజమానులు సంచనల ఆరోపణలు చేశారు.
PSV Garuda Vega movie producers filed cheating case against Hero Rajasekhar and Jeevitha: టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్, ఆయన సతీమణి జీవితపై జోస్టర్ ఫిలిం సర్వీసెస్ గ్రూప్ యజమానులు సంచనల ఆరోపణలు చేశారు. రాజశేఖర్, జీవితలు తమని మోసం చేశారని.. రూ. 26 కోట్లు రూపాయలు చెల్లించకుండా తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని పేర్కొన్నారు. వీరిద్దరితో జాగ్రత్తగా ఉండాలన్నారు. 'గరుడ వేగ' సినిమాకు సంబంధించిన ఆర్ధిక లావాదేవీల్లో రాజశేఖర్ దంపతులు అవకతవకలకు పాల్పడినట్లు వారు ఆరోపిస్తున్నారు.
2017లో రాజశేఖర్ హీరోగా, ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో 'పీఎస్‌వీ గరుడ వేగ' సినిమా వచ్చింది. పోలీస్ ఆఫీసర్ పాత్రలో రాజశేఖర్ బాగా ఆకట్టుకున్నారు. వరుస ప్లాపులతో సతమతమవుతున్న రాజశేఖర్‌కి ఈ సినిమా మంచి బ్రేక్ ఇచ్చింది. కథ, పాటలు బాగుండడంతో కలెక్షన్ల వర్షం కూడా కురిసింది. చిత్రాన్ని జీవితా రాజశేఖర్ కుటుంబం స్వయంగా డిస్ట్రిబ్యూట్ చేశారు. గరుడ వేగ నిర్మాణ భాగస్వామిగా జోస్టర్ ఫిలిం సర్వీసెస్ గ్రూప్ ఉంది.
'రాజశేఖర్ దంపతులు గరుడ వేగ సినిమా నిర్మాణానికి ఆస్తులు తాకట్టు పెట్టి మా దగ్గర రూ.26 కోట్లు తీసుకున్నారు. ఇప్పుడు ఆ నగదును తిరిగి ఇవ్వడం లేదు. గరుడ వేగ సినిమా నిర్మాణానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో రాజశేఖర్ మా దగ్గరకు వచ్చి ఎమోషనల్ అయ్యారు. రాజశేఖర్ వాళ్ల నాన్న వరదరాజన్ కోరిక మేరకు ఆస్తులు తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇచ్చాం. ఆ ఆస్తులను బినామిలా పేరుతో మార్చుకుని మమల్ని మోసం చేశారు' అని జోస్టర్ ఫిలిం సర్వీసెస్ యజమానులు అన్నారు.
'రాజశేఖర్, జీవితల వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. జీవిత చాలా డేంజరస్ మనస్తత్వం కలిగిన మనిషి. తమిళనాడు, ఏపీలోని నగరి కోర్టులో వీరిద్దరిపై కేసులు జరుగుతున్నాయి. చెక్ బౌన్స్ కేసులో జీవిత, రాజశేఖర్‌పై నగరి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా ఇష్యూ చేసింది. త్వరలోనే రాజశేఖర్ జైలుకు వెళ్తాడు. అవకాశం కోసం జీవిత, రాజశేఖర్ మమ్మల్ని వాడుకున్నారు' అని జోస్టర్ ఫిలిం యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ వ్యాఖ్యలపై జీవిత రాజశేఖర్ స్పందించారు. తమపై కొందరు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు. వీటిపై రేపు (ఏప్రిల్ 23) జరగబోయే 'శేఖర్' సినిమా విలేఖరుల సమావేశంలో పూర్తి ఆధారాలతో స్పందిస్తానన్నారు. అప్పటి వరకు ఎటువంటి కథనాలు ప్రసారం చేయవద్దని కోరారు.
Also Read: Romance on Bike Riding: కలికాలం బాబోయ్.. బైక్‌పైనే అన్ని కానిచ్చేస్తున్న లవర్స్! మరో అర్జున్ రెడ్డి
Also Read: Airtel Data Plan: ఎయిర్‌టెల్ చీపెస్ట్ డేటా ప్లాన్ వచ్చేసింది.. జియో కంటే తక్కువ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.