Puneeth Raj Kumar heart touching painting viral: కన్నడ పవర్‌స్టార్‌ పునీత్ రాజ్ కుమార్(Puneeth Raj Kumar) హఠాన్మరణాన్ని అక్కడి ప్రజలు, అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. అక్టోబర్ 29న ఉదయం పునీత్ గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. దీంతో ఒక్కసారిగా కన్నడిగులు షాకయ్యారు. తమ అభిమాన హీరో అలా ఆకస్మాత్తుగా మరణించడంతో కర్ణాటక ప్రజలు.. సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బెంగళూరులోని పునీత్‌ సమాధి వద్దకు ఇప్పటికి భారీ సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారు. ఆయన పట్ల ఉన్న అభిమానం, చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ కంటతడి పెట్టుకుంటున్నారు. మరోవైపు.. పునీత్ అరుదైన ఫోటోస్, వీడియోస్ నెట్టింట్లో షేర్ చేస్తూ.. జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటున్నారు.  ఈ నేపథ్యంలో పునీత్‌ రాజ్‌కుమార్‌ తన తండ్రితో వైకుంఠంలో ఉన్నట్టుగా ఓ చిత్రకారుడు గీసిన పెయింటింగ్‌(Painting) సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 



Also read: Ram Charan: పునీత్ రాజ్‌కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన రామ్ చరణ్


ప్రముఖ చిత్రకారుడు కరణ్ ఆచార్య రూపొందించిన ఈ పెయింటింగ్‌లో పునీత్‌.. తన తండ్రి రాజ్ కుమార్‌(RajKumar)కు వెనుక నుంచి వచ్చి ఆయన కళ్లు మూసినట్టుగా గీశారు. ఈ పెయింటింగ్‌ను చూస్తున్న ఆయన అభిమానులు భావోద్వేగంతో ‘హార్ట్‌ టచింగ్‌.. వి మిస్‌ యూ పునీత్‌ సర్‌, మాటలు రావడం లేదు.. కన్నీళ్లు వస్తున్నాయి. వాట్‌ ఏ క్రియేటివిటీ, అద్భుతం’’ అంటూ ట్విటర్‌లో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.


Also Read: Puneeth Rajkumar: ఫ్యాన్స్​​ను కంటతడి పెట్టిస్తున్న పునీత్ రాజ్​కుమార్ లాస్ట్​ వీడియో!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook