Puneeth Rajkumar: ఫ్యాన్స్​​ను కంటతడి పెట్టిస్తున్న పునీత్ రాజ్​కుమార్ లాస్ట్​ వీడియో!

Puneeth Rajkumar: ఆకస్మిక మరణంతో తీవ్ర విషాదం మిగిల్చిన పునీత్ రాజ్​కుమార్​ చివరి క్షణాల్లో ఎలా ఉన్నారో చూపిస్తున్న ఓ విడియో నెట్టింట హాట్​ టాపిక్​గా మారింది. ఆ వీడియోలో ఏముందో మీరూ చూడండి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 3, 2021, 11:56 AM IST
  • నెట్టింట పునీత్ రాజ్​కుమార్ లాస్ట్ వీడియో వైరల్​
  • గత నెల 29న మృతి చెందిన కన్నడ పవర్​స్టార్​
  • 'అప్పు' చివరి క్షణాలు చూసి ఫ్యాన్స్ భావోద్వేగం
Puneeth Rajkumar: ఫ్యాన్స్​​ను కంటతడి పెట్టిస్తున్న పునీత్ రాజ్​కుమార్ లాస్ట్​ వీడియో!

Puneeth last Video: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నింపిన కన్నడ పవర్​స్టార్ పునీత్ రాజ్​కుమార్ మృతి తర్వాత ఆయనకు సంబంధించి రోజుకో కొత్త విషయం బయటకు వస్తోంది. ఆయన చేసిన మంచి పనుల గురించి వస్తున్న వార్తలు అందరిని తీవ్ర భావోద్వేగానికి గురి చేస్తున్నాయి.

ఇప్పుడు ఆయన మృతి చెందడానికి కొన్ని నిమిషాల ముందు ఎలా ఉన్నారో చూపిస్తూ.. ఓ వీడియో నెట్టింట వైరల్​గా మారింది. ఆ వీడియోలో పునీత్ యాక్టివ్​గా ఉన్నట్లు కనిపించారు. సాధారణంగా మాట్లాడుతూ.. నడుస్తున్నట్లు అందులో ఉంది.

వీడియోకి సంబంధించిన పూర్తి వివరాలు..

వ్యాయామం చేస్తున్న సమయంలో నలతగా అనిపించడంతో.. భార్య అశ్వినీతో చెప్పి ఫ్యామిలీ డాక్టర్​ను కలిసేందుకు వెళ్లే సమయంలోని దృష్యాలు అంటూ ఈ వీడియో వైరల్ అవుతోంది. అందులో పునీత్ తానే స్వయంగా నడుచుకుంటూ.. కారు వద్దకు వచ్చారు. ఈ దృష్యాలన్ని ఆక్కడి సీసీ కెమెరాలో రికార్ట్​ అయ్యాయి.

'అక్కడి నుంచే పునీత్​ తమ ఫ్యామిలీ డాక్టర్ వద్దకు వెళ్లారు. తర్వాత ఆస్పత్రిలో చేరారు. కానీ డాక్టర్లు ఎంత ప్రయత్నించినా పునీత్ ప్రాణాలు నిలబడలేదు' అనేది ఆ వీడియోకు సంబంధించిన సారాంశం.

పునీత్ మృతి పట్ల భాషతో సంబంధంలో లేకుండా దేశవ్యాప్తంగా ఉన్న సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సంతాపం తెలిపారు. తెలుగులో దిగ్గజ నటులు పునీత్​కు కడసారి చూసి కంటతడి పెట్టారు. ఇక కర్ణాటక సీఎం బస్వరాజ్​ బొమ్మై సహా, మాజీ ముఖ్యమంత్రులు యడియూరప్ప, సిద్ద రామయ్యలు పునీత్ అంత్యక్రియలకు హాజరయ్యారు. దీనితో పునీత్ అంటే అందరికి ఎంత ఆప్యాయతో అర్థం చేసుకోవచ్చు.

Also read: Puneeth Rajkumar’s eye donation: తన కళ్లతో నలుగురికి చూపునిచ్చిన పునీత్‌ రాజ్ కుమార్

Also read: Vishal on Puneeth Rajkumar: ఆ పిల్లల చదువు, సంరక్షణ భాద్యత నాదే అంటున్న విశాల్‌కు నెటిజన్ల ప్రశంసలు

అభిమానుల భావోద్వేగం..

అయితే ఈ వీడియోలోని దృష్యాలు నిజంగానే అప్పు చివరిసారిగా బయటకు వెళ్లేటప్పటివా? అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. కానీ అభిమానలు మాత్రం ఈ వీడియోలో తమ అభిమాన నటుడు అప్పుని చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

యూట్యూబ్​లో అప్లోడ్ చేసిన ఈ వీడియోను ఇప్పటి వరకు 6.3 లక్షల మంది వీక్షించారు. వీడియో కింద కామెంట్లలో చాలా మంది పునీత్ చేసిన మంచి పనుల గుర్తు చేసుకుంటున్నారు. మరికొంత మంది ఆయన గొప్ప వ్యక్తి అని.. కానీ ఆయనకే ఇలా జరగటం అన్యాయమంటూ అభిప్రాయపడుతున్నారు.

Also read: Hero Vishal: 'పునీత్​కు మాటిస్తున్నా..ఇకపై ఆ బాధ్యత నాది': విశాల్

Also read: Puneeth Rajkumar's death: పునీత్ రాజ్‌కుమార్ మృతికి అసలు కారణం ఇదేనా ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News