Puri Jagannadh's Jana Gana Mana Shelved: కొద్ది రోజుల నుంచి జరుగుతున్న ప్రచారమే నిజమైంది లైగర్ సినిమా దారుణమైన డిజాస్టర్ ఫలితం అందుకోవడంతో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ చేస్తున్న రెండో సినిమా జనగణమన ఆగిపోయినట్లుగా తెలుస్తోంది. నిజానికి లైగర్ సినిమా విడుదల కాకముందే జనగణమన అనే ఒక సబ్జెక్ట్ పట్టాలెక్కించారు. పూరి జగన్నాథ్ కెరీర్ లోని ఆయన డ్రీమ్ ప్రాజెక్టుగా చెప్పుకునే ఈ జనగణమన అనే సినిమా ముందుగా మహేష్ బాబుతో చేయాలనుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ చివరికి విజయ్ దేవరకొండ తో ఈ సినిమా పట్టా లెక్కించారు. వంశీ పైడిపల్లి శ్రీకర అనే నిర్మాణ సంస్థ సహనిర్మాణంలో పూరీ కనెక్ట్స్ బ్యానర్ ఈ సినిమా నిర్మిస్తుందని భావించారు. వంశీ పైడిపల్లి నిర్మాతగా శ్రీకర ఫిలిమ్స్ ఈ సినిమా నిర్మిస్తుందని అప్పట్లోనే ప్రకటించారు. అయితే వాస్తవానికి పేరు వంశీ పైడిపల్లిది కనిపిస్తున్నా ఈ సినిమాను మై హోమ్ సంస్థ నిర్మించాలని భావించింది. ప్రస్తుతానికి వంశీ పైడిపల్లి మై హోమ్ సంస్థకే చెందిన ఆహా ప్లాట్ ఫామ్ కి క్రియేటివ్ హెడ్ గా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.


ఇదే నేపథ్యంలో ఈ సినిమాకు ఆయననే నిర్మాతగా మై హోం సంస్థ ఉంచాలని భావించింది.  అదేవిధంగా ఈ సినిమా లాంచ్ కూడా ఒక రేంజ్ లో చేశారు. అయితే ఇప్పుడు బడ్జెట్ ఇష్యూస్ కారణంగా సినిమా నిలిపివేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ పూరీ జగన్నాథ్ ఇద్దరికీ ప్రస్తుతానికి మార్కెట్ బాలేదని, ఇప్పుడు బడ్జెట్ పెడితే మళ్లీ రిటర్న్ వస్తాయో రావో అనే విషయం మీద క్లారిటీ లేకపోవడంతో సినిమా నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ ఇద్దరి దృష్టికి నిర్మాతలు తీసుకువెళ్లడంతో వారు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇక మరికొద్ది రోజులలో లైగర్  సినిమా డిస్ట్రిబ్యూటర్లను పూరి జగన్నాథ్ కలవబోతున్నారని సమాచారం అందుతుంది.


సుమారుగా 30% నష్టాలను తాను భరిస్తూ డబ్బులు ఇవ్వడానికి పూరి జగన్నాధ్ సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది ఇక విజయ్ దేవరకొండ తో సినిమా క్యాన్సిల్ అయింది కాబట్టి పూరి జగన్నాథ్ మళ్లీ ఏ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఖుషి సినిమా అయితే ఇప్పటికే 70% షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంద. ఇక ఈ సినిమా పూర్తయిన తర్వాత విజయ్ దేవరకొండ సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు పూరీ జగన్నాధ్ సహా విజయ్ దేవరకొండకు కచ్చితంగా ఒక హిట్ సినిమా చాలా అవసరం అనే చెప్పాలి. చూడాలి మరి సమీప భవిష్యత్తులో ఎలాంటి ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనేది.


Also Read: Bandla Ganesh on Jr NTR: వివాదంపై స్పందించిన బండ్ల.. ఎన్టీఆర్ ను కూడా ప్రేమిస్తున్నానంటూ !


Also Read: Bandla Ganesh vs Jr NTR: బండ్ల గణేష్-ఎన్టీఆర్ మధ్య అసలు వివాదం ఏమిటో తెలుసా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి