Garikapati Comments on Pushpa: ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు పుష్ప మూవీపై సీరియస్‌ అయ్యారు. ఆ మూవీలోని పుష్ప రాజ్‌ క్యారెక్టర్‌‌పై విరుచుకపడ్డారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన గరికపాటి (Garikapati) తాజాగా ఒక ఇంటర్వ్యూలో పలు విషయాలపై మాట్లాడారు. ఈ క్రమంలో ప్రస్తుత సినిమాల (Cinema) ప్రస్తావన కూడా వచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప మూవీపై ఆయన ఫైర్‌‌ అయ్యారు. ఆ మూవీలో హీరోను స్మగ్లర్‌‌గా చూపించారని.. స్మగ్లింగ్ (Smuggling) చేసే అతను ఏదో ఘనకార్యం చేస్తున్నట్లుగా తగ్గేదేలే అంటాడా అని గరికపాటి సీరియస్‌ అయ్యారు. ఆ మూవీ హీరోనుగానీ, డైరెక్టర్‌‌గానీ తనకు సమాధానం చెప్తే.. వారిని కడిగేస్తాను అంటూ విరుచుకపడ్డారు.


ఇక మనం ఏమన్నా సినిమా గురించి మాట్లాడితే వాళ్లేమో.. మూవీ (Movie) చివరిలో మేము అంతా మంచిగానే చూపిస్తాము అని అంటారని గరికపాటి పేర్కొన్నారు. లేదంటే ఈ సినిమాకు ఇంకో పార్ట్‌ ఉంటుంది... అందులో మంచిగా చూపిస్తాము అని చెప్తారని ఆయన చెప్పుకొచ్చారు. ఎప్పుడో తర్వాత రెండో పార్ట్‌లో మూడో పార్ట్‌లో చూపించే వరకు ఈ సొసైటీ (Society) పాడవదా? అని ఆయన ప్రశ్నించారు. 



పైగా ఆ స్మగ్లింగ్‌ (Smuggling‌) చేసేవాడు తగ్గేదేలే అనడం ఏంటండీ మరీనూ అంటూ తనలోని ఆవేదన అంతా గరికపాటి వ్యక్తం చేశారు. ఇక ఆ డైలాగ్‌ ఏమో ఒక పెద్ద ఉపనిషత్తు సూక్తిలా మారిపోయిందని ఎద్దేవా చేశారు. ఇప్పుడు కుర్రాళ్లు వేరేవాళ్ల గూబ మీద గట్టిగా ఒకటి కొట్టేసి తగ్గేదేలే అంటున్నారు.. మరి దీనికి కారణం ఎవరని ప్రశ్నించారు. 


అయినా ఇలాంటి తగ్గేదేలే (Thaggedhe le) డైలాగ్స్‌ను ఎవరు చెప్పాలండీ... శ్రీరాముడులాంటి వారో.. హారిశ్చంద్రుడులాంటి వారో చెప్పాలి అని ఆయన పేర్కొన్నారు. ఒక స్మగ్లర్ (Smuggler) ఇలాంటి డైలాగ్స్ చెప్పడం ఏంటండీ అంటూ ఆయన మండిపడ్డారు.


Also Read: MS Dhoni Atharva: మైథలాజికల్ సూపర్ హీరోగా ధోనీ.. కొత్త అవతార్‌లో అదుర్స్..


Also Read: తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. మ్యూచువల్ ట్రాన్స్‌ఫర్స్‌కు గ్రీన్ సిగ్నల్..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook