MS Dhoni Atharva: మైథలాజికల్ సూపర్ హీరోగా ధోనీ.. కొత్త అవతార్‌లో అదుర్స్..

MS Dhoni as Atharva : ఎంఎస్ ధోనీ.. టీమిండియా కెప్టెన్‌గా ఎన్నో చిరస్మరణీయ విజయాలందించిన ఈ మాజీ కెప్టెన్.. ఇప్పుడు మరో కొత్త అవతారమెత్తాడు. యానిమేటెడ్ గ్రాఫిక్ పాత్ర 'అథర్వ'గా అలరించబోతున్నాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 3, 2022, 11:15 AM IST
  • ఎంఎస్ ధోనీ కొత్త అవతారం
  • యానిమేటెడ్ గ్రాఫిక్ సిరీస్ అథర్వలో కనిపించనున్న ధోనీ
  • అథర్వ పాత్రతో అలరించబోతున్న ధోనీ
MS Dhoni Atharva: మైథలాజికల్ సూపర్ హీరోగా ధోనీ.. కొత్త అవతార్‌లో అదుర్స్..

MS Dhoni as Atharva: టీమిండియా మాజీ కెప్టెన్ 'ఎంఎస్ ధోనీ' మైథలాజికల్ సూపర్ హీరో అవతారమెత్తాడు. యానిమేటెడ్ సిరీస్‌గా వస్తున్న సైన్స్ ఫిక్షన్  గ్రాఫిక్ నవల 'అథర్వ-ది ఆరిజిన్‌'లో అథర్వగా కనిపించబోతున్నాడు. దీనికి సంబంధించిన మోషన్ పోస్టర్ తన ఫేస్‌బుక్ ఖాతాలో షేర్ చేశాడు. కండలు తిరిగిన దేహం, జులపాల జుట్టు, చేతిలో ఆయుధాలతో రాక్షసులతో తలపడుతున్న ఆ వీడియోలో ధోనీ ఒక యోధుడిలా కనిపిస్తున్నాడు. 

'ఈ ప్రకటన చేయడానికి చాలా సంతోషంగా ఉంది... నా కొత్త అవతార్.. అథర్వ...' అని పేర్కొంటూ ధోనీ ఆ వీడియోను షేర్ చేశాడు. ధోనీ కొత్త అవతార్‌కి నెటిజన్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది. 'ఇది ఫ్లాప్ అవుతుందా.. హిట్ అవుతుందా తెలియదు.. కానీ దీని ద్వారా ఇండియా గ్రాఫిక్ నావల్స్‌కి రీడర్స్ పెరగడం ఖాయం.' అని ఓ నెటిజన్ కామెంట్ చేయడం గమనార్హం. 

తమిళ మ్యూజిక్ డైరెక్టర్ రమేష్ తమిళ్‌ మణి రచించిన సైన్స్ ఫిక్షన్ పీరియాడిక్ నవల 'అథర్వ ది ఆరిజిన్‌'ను అమెజాన్ యానిమేటెడ్‌ సిరీస్‌గా తీసుకొస్తోంది. ఇందులో ప్రధాన పాత్ర 'అథర్వ'గా ధోని (MS Dhoni) కనిపించబోతున్నాడు. విర్జూ స్టూడియోస్, మిడాస్ డీల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ సంయుక్తంగా దీన్ని రూపొందిస్తున్నాయి. ఈ ప్రాజెక్టులో తాను భాగమైనందుకు చాలా థ్రిల్లింగ్ ఉందని ఇటీవల ఓ జాతీయ మీడియాతో ధోనీ వెల్లడించాడు. ఆకట్టుకునే కథ, కళాకృతులతో కూడిన ఈ గ్రాఫిక్ నవల రీడర్స్‌ను ఆకట్టుకుంటుందని.. ఇండియా మొట్టమొదటి మైథాలజికల్ సూపర్ హీరో పాత్ర అందరిని అలరిస్తుందని పేర్కొన్నాడు.

Also Read: తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. మ్యూచువల్ ట్రాన్స్‌ఫర్స్‌కు గ్రీన్ సిగ్నల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News