Allu Arjun apologies to Kiran Abbavaram : అల్లు అర్జున్ తాజాగా నటిస్తున్న పుష్ప -2 సినిమా ట్రైలర్ పైన పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంటర్నేషనల్, వైల్డ్ ఫైర్ అంటూ ట్వీట్లు చేస్తున్నారు. ఈ మేరకు హను రాఘవపూడి, ప్రశాంత్ వర్మ, బాబీ ,అనిల్ రావిపూడి,రాజమౌళి, మెహర్ రమేష్ వంటి దిగ్గజ దర్శకులు ట్రైలర్ ను కొనియాడుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలాగే యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కూడా తాజాగా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కి బన్నీ రిప్లై కూడా ఇచ్చాడు. 24 గంటలు గడవకముందే 100 మిలియన్ వ్యూస్ రాబట్టిన ఈ ట్రైలర్ టాలీవుడ్ అభిమానుల చేత ప్రశంసలు అందుకుంటుంది. ఈ  మేరకు పుష్ప 2  ట్రైలర్ మీద కిరణ్ అబ్బవరం ట్వీట్ చేశాడు. వైల్డ్ ఫైర్.. డిసెంబర్ 5 కోసం వెయిటింగ్ అంటూ ట్వీట్ వేయడం జరిగింది. 


 



ఈ ట్వీట్ కి అల్లు అర్జున్ రిప్లై ఇస్తూ.." థాంక్యూ బ్రదర్.. బిజీగా ఉండడం వల్ల మీ సినిమాని చూడలేకపోయాను. క్షమించండి ..తప్పకుండా నేను మీ మూవీ చూసి మీకు కాల్ చేస్తాను" అంటూ రిప్లై ఇచ్చారు. దీనికి మళ్లీ కిరణ్ స్పందిస్తూ.. థాంక్యూ అన్న అంటూ కూడా రిప్లై ఇచ్చారు. 


ఇకపోతే దీపావళి సందర్భంగా కిరణ్ అబ్బవరం క సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. సినిమాకి మెల్లిమెల్లిగా షోలు, స్క్రీన్లు కూడా పెరిగిపోయాయి. చివరికి ఊహించినట్టుగా రూ.50 కోట్ల క్లబ్లో చేరి రికార్డు సృష్టించింది. వివాహం తర్వాత క మూవీతో సాలిడ్ సౌండ్ చేశారు కిరణ్ అబ్బవరం. దీంతో ఈ సౌండ్ బన్నీ వరకు వెళ్లడంతో ఆయన కూడా చూస్తానని తెలిపారు. ఇక మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా చిత్ర బృందాన్ని అభినందించిన విషయం అందరికీ తెలిసిందే.


Also Read: Telangana Survey: ఇంటింటి సర్వేపై అదే నిర్లక్ష్యం.. 12 రోజులలో 58 శాతమే పూర్తి


Also Read: KT Rama Rao: లగచర్ల గ్రామాన్ని రేవంత్‌ రెడ్డి సమాధి చేస్తుండు: కేటీఆర్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter