Allu Arjun Case: అల్లు అర్జున్ను మళ్లీ విచారించనున్న పోలీసులు, అసలు మతలబు ఇదేనా
Allu Arjun Case: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందడంతో చెలరేగిన వివాదం ఇంకా సద్దుమణగలేదు. తెలంగాణ ప్రభుత్వం వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం రోజురోజుకూ ముదురుతోంది.
Allu Arjun Case: పుష్ప 2 విడుదల సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందిన కేసులో అరెస్ట్ అయిన అల్లు అర్జున్ బెయిల్‌పై బయటికొచ్చినా అటు ప్రభుత్వం ఇటు పోలీసులు వదలడం లేదు. మరోసారి విచారణకు రావాలంటూ నోటీసులు చేయడం ఇందుకు కారణం.
అల్లు అర్జున్ వర్సెస్ తెలంగాణ ప్రభుత్వం వ్యవహారం రోజురోజుకూ పెరిగి పెద్దదవుతోంది. సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మరణించగా ఆమె కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ కేసులో ఏ11 అల్లు అర్జున్‌ని చిక్కడ్‌పల్లి పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా న్యాయస్థానం రిమాండ్ విధించింది. ఆ తరువాత హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడదలయ్యారు. అప్పట్నించి ప్రభుత్వం వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదురుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా ఈ వ్యవహారంపై ఆసక్తి చూపించడం గమనార్హం. సాక్షాత్తూ అసెంబ్లీలో అల్లు అర్జున్‌పై విమర్శలు చేశారు. అల్లు అర్జున్‌పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో తెలంగాణ ప్రభుత్వం వైఖరి స్పష్టమైపోయింది.
అసెంబ్లీలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన గంటల వ్యవధిలో పోలీసు యంత్రాంగం స్పందించింది. ఇవాళ అంటే మంగళవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావల్సిందిగా పోలీసులు అల్లు అర్జున్‌కు మరోసారి నోటీసులు పంపించారు. వాస్తవానికి ఒకసారి అరెస్ట్ అయిన ఈ కేసులో రెండోసారి విచారణకు పిలవాల్సినంత సీరియస్ కేసు కాదిది. అయినా విచారణ పేరుతో పిలవడం చర్చనీయాంశంగా మారింది. ఇతర కేసులు పెట్టి మళ్లీ అరెస్ట్ చేస్తారా అనే వాదన విన్పిస్తోంది.
Also read: Cyclone Alert: ఏపీకు తుపాను ముప్పు, ఈ జిల్లాల్లో ఇక భారీ వర్షాలు తప్పవు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి