Cyclone Alert: ఏపీకు తుపాను ముప్పు, ఈ జిల్లాల్లో ఇక భారీ వర్షాలు తప్పవు

Cyclone Alert: ఆంధ్రప్రదేశ్‌కు వరుస తుపాన్లు, అల్పపీడనాలు వెంటాడుతున్నాయి. ఇప్పుడు మరోసారి తుపాను ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఫలితంగా కోస్తా జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక జారీ అయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 24, 2024, 09:02 AM IST
Cyclone Alert: ఏపీకు తుపాను ముప్పు, ఈ జిల్లాల్లో ఇక భారీ వర్షాలు తప్పవు

Cyclone Alert: గత కొద్దిరోజులుగా బంగాళాఖాతంలో వరుసగా అల్పపీడనాలు, తుపాన్లు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే భారీ వర్షాలు దంచికొట్టాయి. తాజాగా మరోసారి బంగాళాఖాతంలో తుపాను ఏర్పడనుందని ఐఎండీ వెల్లడించింది. ఫలితంగా రానున్న రోజుల్లో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. కోస్తా ప్రాంతంలో ప్రస్తుతం తేలికపాటి వర్షాలు పడుతున్నాయి. రానున్న రోజుల్లో ఈ తీవ్రత మరింతగా పెరగనుంది. 

Add Zee News as a Preferred Source

బంగాళాఖాతంలో ఇటీవల ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఇంకా కొనసాగుతోంది. ఈ అల్పపీడనాన్ని అంచనా వేయడం కష్టమౌతోంది. వాయుగుండం నుంచి తీవ్ర అల్పపీడనంగా బలహీనపడినా మరోసారి బలపడే అవకాశాలు లేకపోలేదని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఈ అల్పపీడనం ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీరంవైపుకు కదులుతోంది. చలిగాలులు, వాతావరణం ప్రకారం మరోసారి బలపడే అవకాశాలు కన్పిస్తున్నాయి. తుపానుగా మారే అవకాశాలు కూడా ఉండవచ్చని తెలుస్తోంది. ఇప్పటికే కోస్తా జిల్లాల్లో వాతావరణం ముసురు పట్టి ఉంది. అక్కడక్కడా తేలికపాటి వర్షాలు పడుతున్నాయి. ఈ అల్పపీడనం ప్రభావంతో రానున్న రోజుల్లో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కూడా పడవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. 

ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, కాకినాడ,  గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. తీరం వెంబడి గంటకు 40-60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని కళింగపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. భారీ వర్షాలుండే ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవులు ఇవ్వనున్నారు. 

Also read: Tirumala: జనవరి 5వ తేదీ నుంచి వారికి ప్రత్యేక దర్శనం టిక్కెట్లు.. ఇలా వెంటనే బుక్‌ చేసుకోండి..

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Trending News