Pushpa 2 Second Lyrical Promo: అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందాన హీరోయిన్ గా.. వస్తున్న పుష్ప 2 పైన ప్రపంచం మొత్తం ఎన్ని అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆగస్టు 15న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. కాగా ఈ సినిమా ప్రమోషన్స్ ని ఈ నెల మొదటి నుంచే సినిమా యూనిట్ మొదలుపెట్టేశారు. ఇందులో భాగంగా ఈ మధ్యనే ఈ చిత్రం నుంచి ఫస్ట్ లిరికల్ పుష్ప పుష్పను .. విడుదల చేశారు చిత్ర యూనిట్.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కాగా ఇప్పుడు రెండో లిరికల్ కూడా విడుదల చేయనున్నామని నిన్ననే తెలియజేశారు. కాగా ఇప్పుడు ఈ సెకండ్ లిరికల్ కి సంబంధించిన ప్రోమో ని విడుదల చేస్తూ.. ఈ ఫుల్ సాంగ్ లిరికల్ ఎప్పుడు విడుదల చేస్తాం అనే డేట్ కూడా బయటపెట్టేశారు. ఈ ప్రోమో కేశవ వాయిస్ ఓవర్ తో స్టార్ట్ అయ్యింది. ఓ శ్రీవల్లి వదిన.. పుష్ప 2 నుంచి సెకండ్ లిరికల్ విడుదల చేస్తున్నారట కదా.. ఆ పాట ఏమిటో చెబుతావా..” అని పక్కా యాసలో.. మేకప్ వేసుకుంటున్న రష్మికను అడుగుతారు. వెంటనే రష్మిక .. “చూసేకి అతిరథ వల్లే ఉంటారు నా సామి”.. అంటూ ఈ పాటలో తాను వేసే సిగ్నేచర్ స్టెప్ చూపిస్తూ ఆకట్టుకుంది. ఇక ఈ పాటని 29 మే ఉదయం పదకొండు గంటల ఏడు నిమిషాలకు విడుదల చేస్తాము అని ప్రకటించాడు.


మొత్తానికి మరోసారి కూడా నా సామి అంటూ శ్రీవల్లి మెప్పించబోతోంది అని అర్థమైంది. కాగా ఈ పాటకు కింద కపుల్ సాంగ్ అని ట్యాగ్ లైన్ కూడా పెట్టారు. ఇక పుష్ప మొదటి భాగంలో నా సామి సాంగ్ సృష్టించిన సెన్సేషన్ ఎలాంటిదో ప్రపంచమంతా తెలుసు. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్..రష్మిక స్టెప్పులు ఆ పాట కి హైలైట్ గా నిలిచాయి. చూస్తుంటే ఇప్పుడు రాబోయే ఈ పాట ఆ పాటను మించిపోయేలా అనిపిస్తోంది. మొత్తానికి మొదటి లైన్ తోనే ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ నా సామి సాంగ్ ఎలాంటి సునామీ సృష్టిస్తుందో తెలియాలి అంటే.. మే 29 వరకు వేచి చూడాలి.


 



 


Read more: Bhootonwala mandir: ఒక్క రాత్రిలో దెయ్యాలు కట్టిన ఆలయం.. దీని విశిష్టతో ఏంటో తెలుసా..?


Read more: Snakes facts: ప్రపంచంలోనే అత్యంత స్పీడ్ గా వెళ్లే పాములు.. ఇవి చాలా డెంజర్ భయ్యా.. డిటెయిల్స్ ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter