Bhootonwala mandir: ఒక్క రాత్రిలో దెయ్యాలు కట్టిన ఆలయం.. దీని విశిష్టతో ఏంటో తెలుసా..?

Uttar pradesh News: మీరట్ జిల్లాలోని సింబావోలీ గ్రామంలో ఒక శివాలయం ఉంది. దీన్ని దర్శించుకొవడానికి దూరప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారు. శివరాత్రి రోజున ఇక్కడ పెద్ద జాతర జరుగుతుందని చెబుతుంటారు.

1 /6

శివుడిని భోళా శంకరుడు అంటారు. ఆయన పులి చర్మం ధరించి, ఒంటికి భస్మంపూసుకుని స్మశానంలో ఎక్కువగా తిరుగుతు ఉంటారని చెబుతుంటారు. ఎక్కువగా మాంత్రికులు, దానవులు  భోళా శంకరుడి గురించి వరాలు పొంది తర్వాత  వారి నాశనం వారే కొని తెచ్చుకున్న విషయం పురాణాలలో మనం చదివాం.

2 /6

ఇదిలా ఉండగా.. ఉత్తర ప్రదేశ్ లోని దతియాన్నా గ్రామం ఉంది. ఇక్కడ భూతన్ వాల్ మందిరం చాలా ఫెమస్. దీన్ని రాత్రి రాత్రే దెయ్యాలు నిర్మించాయని చెబుతుంటారు. కొన్నేళ్ల క్రితం ఇప్పుడున్న శివాలం ప్రదేశంలో ఖాళీగా మైదానం ఉండేది . కానీ ఒక రోజు ఉదయం లేచి చూసేసరికి, ఎర్ర ఇటుకతో ఆలయం నిర్మించి ఉంది. 

3 /6

ఆ ఆలయం కూడా అసంపూర్తిగా ఉంది. అందులో శివుడి ప్రతిమలు ఉన్నాయి. ఆ టెంపుల్ ఉన్న ప్రదేశంలో దెయ్యాలు ఎక్కువగా తిరుగుతాయని గ్రామస్థులు రాత్రి అయితే అక్కడికి అస్సలు వెళ్లరు. అలాంటిది ఒక ఆలయం చూసి అందరు ఆశ్చర్యపోయాయి. 

4 /6

ఇది ఖచ్చితంగా దెయ్యాలు నిర్మించాయని గ్రామస్థులు ఫిక్స్ అయ్యారు. కానీ దాన్ని డెవలప్ చేసే పనులు మాత్రం చేయలేదు. కేవలం ఎర్రటి ఇటుకతో నిర్మించిన ఆలయం అలానే ఉంచారు. కానీ.. రాజా నైన్ సింగ్ ఆ తర్వాత ఆలయంను డెవలప్ చేశాడని అక్కడి వారు చెబుతుంటారు. 

5 /6

ఆ తర్వాత గుప్తుల కాలంలో భూతన్ వాలా టెంపుల్ ను ఇంకా డెవలప్ చేశారని స్థానికులు చెబుతుంటారు. అయితే.. ఇప్పకి కూడా అక్కడి ప్రజలు ఇది దెయ్యాలు నిర్మించిన ఆలయంగానే చెప్పుకుంటారు. సాయంత్రంకాగానే ఆ ఆలయంకు ఎవరు కూడా వెళ్లరు.

6 /6

ఇక శ్రావణ మాసంలో, శివరాత్రి సమయంలో ఆ టెంపుల్ లో పెద్ద ఎత్తున పూజలు, అభిషేకాలు, ఉత్సవాలు జరుగుతుంటాయి. దీనికి చుట్టుపక్కల ఉన్న గ్రామస్థులంతా వస్తుంటారు. ఇప్పటికి కూడా ఆ ఆలయం చరిత్ర ఒక మిస్టరీగా ఉంది. ప్రస్తుతం ఈ ఘటన మాత్రం సోషల్ మీడియాలో మరోసారి ట్రెండింగ్ లో నిలిచింది.