Pushpa 2 Spoiler Alert: బాహుబలి అయినా.. పుష్పా అయినా.. పెళ్ళాం వల్లే గొడవలు
Allu Arjun భార్యను ప్రేమించే భర్త దొరకడం..అదృష్టం. ఇక భార్య మాటే విని.. ఏదైనా చేసే భర్త దొరకడం మరింత అదృష్టం. ఇక ఇదే రూటుని ఈమధ్య సినిమాల్లో.. పాన్ ఇండియా హీరోలు సైతం ఫాలో అవుతున్నారు. అంతేకాదు ఈ కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాలు బ్లాక్ బస్టర్ విజయం సాధిస్తున్నాయి. మీరు విన్నది నిజమే.. పూర్తి వివరాల్లోకి వెళితే..
Pushpa 2 Story:
తెలుగు సినిమా స్థాయిని పెంచిన చిత్రం బాహుబలి. పాన్ ఇండియా పరంగా ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. అంతేకాదు సౌత్ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు.. తెచ్చిపెట్టింది. అసలు పాన్ ఇండియా కాన్సెప్ట్ అనేది మొదలయ్యిందే బాహుబలి తో అన్నంలో ఎటువంటి సందేహం లేదు.
అలాంటి బాహుబలి సినిమా మొత్తానికి కారణం ఎవరు అంటే.. తప్పకుండా దేవసేనానే. అవును అందులో అనుష్క.. పోషించిన దేవసేన పాత్ర వల్లే కథ మొత్తం ముందుకు నడుస్తుంది. బాహుబలి రెండో భాగం తీసుకుంటే.. అందులో అనుష్క రమ్యకృష్ణ కి రాసే ఒక లేఖ వల్లే.. సినిమా మొత్తం మొదలవుతుంది.
ఆ తరువాత అనుష్క (దేవసేన).. ప్రభాస్(బాహుబలి) ని రాజుగా చూడాలి అన్న దగ్గర నుంచే.. గొడవలు మొదలవుతాయి. అంతేకాదు అనుష్కను తాకారని చెప్పి ప్రభాస్.. సైనికుడిని నరికేయడంతో.. అతని జీవితమే తారుమారు అవుతుంది. అంటే బాహుబలి కథ మొత్తం.. భార్య దైవసేన వల్ల బాహుబలి కి వచ్చే గొడవలే.
ఇక ఇప్పుడు మరో పాన్ ఇండియా సెన్సేషన్ సినిమా ఏమిటి అంటే.. మనకు వెంటనే గుర్తొచ్చే పేరు పుష్ప. అయితే ఈ చిత్రం రెండో భాగంలో కూడా కథ మొత్తం.. భార్య చుట్టూనే తిరగడం గమనర్హం. శ్రీవల్లి… పుష్పని.. సీఎంతో ఫోటో దిగాలి అని అడగడంతో.. కథ మొత్తం తారుమారవుతుంది. ఇక అక్కడి నుంచే పుష్ప గొడవల సైతం మొదలవుతాయి.
సినిమాల్లోనే కాదు నిజజీవితంలో కూడా ఇలాంటి సందర్భాలు ఉన్నాయని.. ప్రస్తుతం నేటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డి కోసమే.. శిల్పారెడ్డికి సపోర్ట్ చేశారు. ఇక అక్కడి నుంచే అల్లు మెగా ఫాన్స్ వార్.. మొదలైంది. ఇదే విషయాన్ని ఇప్పుడు పుష్ప సినిమాతో కంపేర్ చేస్తూ.. ఎవరైనా భార్య ముందు తగ్గాల్సిందే అని నేటిజన్స్.. కామెంట్లు పెడుతున్నారు
Also Read: Teacher Murder: ఏపీలో దారుణం.. గొడవను ఆపిన టీచర్‌ను చంపేసిన విద్యార్థులు
Also Read: Naga Babu: అల్లు అర్జున్ కోసం రంగంలోకి నాగబాబు.. వెనక్కి తగ్గిన జనసేన పార్టీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.