Pushpa 2 Movie Review: ‘పుష్ప 2 ది రూల్’ రివ్యూ.. ‘వైల్డ్’ ఫైర్ రేటింగ్..!
Pushpa 2 Review: బాక్సాఫీసు వద్ద అల్లు అర్జున్ మాస్ జాతర మొదలైంది. భారీ అంచనాల నడుమ పుష్ప-2 మూవీ థియేటర్స్ లో సందడి మొదలుపెట్టింది. పుష్పరాజ్ బాక్సాఫీసును షేక్ చేస్తాడా..? లెక్కల మాస్టర్ సుకుమార్ అన్ని లెక్కలు సరిచేశారా..? రివ్యూలో చూద్దాం పదండి.
మూవీ రివ్యూ: పుష్ప 2 ది రూల్ (Pushpa 2 - The Rule)
నటీనటులు: అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్, జగపతి బాబు, రావు రమేష్, సునీల్, అనసూయ భరద్వాజ్, శ్రీ తేజ్ తదితరులు
ఎడిటర్: నవీన్ నూలి
సినిమాటోగ్రఫీ: మిరోస్లా కుబా బ్రోజెక్
సంగీతం: దేవీశ్రీ ప్రసాద్,
ప్రొడక్షన్ హౌస్: మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచలి
రచన, దర్శకత్వం: సుకుమార్
విడుదల తేది: 5-12-2024
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘పుష్ప పార్ట్ 1 ది రైజ్’ మూవీతో నేషనల్ లెవల్లో సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇపుడు ఆ సినిమాకు కొనసాగింపుగా ‘పుష్ప 2’ విడుదలైంది. ఇప్పటికే పాటలు, టీజర్, ట్రైలర్ తో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. మరి ఆ అంచనాలను ‘పుష్ప 2 ది రూల్’ అందుకుందా. నిజంగా ఈ సినిమాతో బన్ని బాక్సాఫీస్ ను రూల్ చేయడం ఖాయమేనా.. మన మూవీ రివ్యూలో చూద్దాం..
కథ విషయానికొస్తే..
పుష్ప 1 ది రైజ్ సినిమాలో శేషాచలంలో ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తూ.. సాధారణ కూలీ నుంచి ఒక డాన్ గా ఎదిగిన పుష్ప రాజ్ (అల్లు అర్జున్).. శ్రీవల్లి (రష్మిక)ను పెళ్లి చేసుకుంటాడు. అంతేకాదు ఓ డాన్ గా అక్కడ ప్రజలకు అండగా ఉంటాడు. ఈ క్రమంలో అతన్ని ఎలాగైనా తొక్కేయాలని చూస్తూ వుంటారు. మంగళం శ్రీను (సునీల్) గ్రూపులు. భార్య ముఖ్యమంత్రితో ఫోటో దిగమని అడుగుతుంది. కానీ స్మగ్లర్ తో ఫోటో దిగితే.. ఎక్కడ తన ఇమేజ్ కు భంగం కలుగుతుందని అనుకొని ఫోటో దిగడు. దీంతో ముఖ్యమంత్రినే మార్చేయాలనుకుంటారు. ఈ క్రమంలో 2 వేల టన్నుల ఎర్ర చందనం స్మగ్లింగ్ చేయడం ద్వారా వచ్చిన డబ్బులతో భూమి రెడ్డి సిద్దప్ప నాయుడు (రావు రమేష్) ను సీఎం చేస్తాడు. ఈ క్రమంలో పుష్ప రాజ్ కు ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి..? పుష్ప రాజ్ కు ఇంటి పేరు దక్కిందా..? భన్వర్ సింగ్ షెకావత్ పుష్పపై రివెంజ్ తీర్చుకున్నారా..? జగపతిబాబు రోల్ ఏంటి..? వంటి విషయాలు తెలియాలంటే పుష్ప 2 ది రూల్ చూడాల్సిందే.
కథనం, టెక్నికల్ విషయానికొస్తే..
పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ను ఇప్పటి వరకు ఏ దర్శకుడు చూపించని విధంగా చూపించి మెప్పించాడు సుకుమార్. ఇపుడు పుష్ప 2లో బన్నిని అభిమానులు ఏ విధంగా చూపించాలో ఆ విధంగా చూపించాడు. ఒక రకంగా మాస్ అభిమానులకు ఈ సినిమాతో ఫుల్ మీల్స్ పెట్టాడు. ప్రతి` నిమిషాలకు ఓ ఎలివేషన్ సీన్స్ తో ప్రేక్షకులు నెక్ట్స్ ఏమవుతుందో అనే ఆసక్తి కలిగించడంలో సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా అల్లు అర్జున్.. పుష్ప స్వాగ్ ను ఇందులో కంటిన్యూ చేసాడు. ముఖ్యంగా కథపై నమ్మకంతో 3 గంటల 20 నిమిషాలు పెట్టాడు. పాటలు, సన్నివేశాల్లో పకడ్బందీ స్క్రీన్ ప్లే రాసుకోవడంలో కాస్త తడబడ్డాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయింది. ఫస్టాఫ్ అంతా ఎలివేషన్స్ సీన్స్ తో థియేటర్లు మోతమోగిపోతాయి. సెకండాఫ్ లో వైల్డ్ ఫైర్ ఓ రేంజ్ లో ఉంటుంది. క్లైమాక్స్ లో అన్న కూతురు కిడ్నాప్ ఎపిసోడ్ తో ఎండ్ చేసాడు. క్లైమాక్స్ ఎపిసోడ్ లో కాళ్లు, చేతులు కట్టేసినా.. హీరో విలన్ ను ఊచకోత కోయడం వంటివి మాస్ కు ఊపు తెప్పిస్తాయి.
సెంటిమెంట్ సీన్స్ తో సుకుమార్ ప్రేక్షకులతో కన్నీళ్లు పెట్టించాడు. భారీ క్లైమాక్స్ ఫైట్ తో ఫ్యాన్స్ గూస్ బంప్స్ రావడం పక్కా. రష్మికతో అల్లు అర్జున్ కాస్త వైల్డ్ గా ఉన్నాయి. అక్కడక్కడ అతిగా అనిపిస్తాయి. భన్వర్ సింగ్ షెకావత్ పాత్ర అంతగా పండలేదు. ఆయన క్యారెక్టర్ ను ఇంకా బాగా రాసుకొని ఉండాల్సింది. సుకుమార్ ఈ సినిమా కోసం పూర్తి లిబర్టీ తీసుకున్నాడు. మొత్తంగా పుష్పకు సీఎం అయినా.. పీఎం అయినా ఎవరినీ లెక్కచేయని తనం అతిగా అనిపిస్తాయి. ముఖ్యంగా హిందూత్వ అంశాన్ని కూడా సుకుమార్ సృజించాడు. హీరో శివ మాల వేసి మాల్దీవుల్లో శివ లింగానికి పూజ చేయడం.. సెకండాఫ్ లో అమ్మవారి గెటప్ లో చూపించడం వంటివి హిందుత్వానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఎవరైనా లెక్కలేదనే టైమ సినిమా స్టార్టింగ్ లో చేసిన జపాన్ ఫైట్ తర్వాత ఏం జరిగిందనేది తెలుసుకోవాలంటే పుష్ప 3 చూడమని చెప్పాలి. సినిమాలో చాలా లోపాలన్నా.. అల్లు అర్జున్ యాక్టింగ్ తో వాటిని కవర్ అయిపోయింది.
మొత్తంగా అల్లు అర్జున్ తో పాటు రష్మిక సహా ఇతర పాత్రలను ఈ సినిమాలో ఇంపార్టెన్స్ ఇచ్చాడు. అక్కడక్కడ కొన్ని సీన్స్ ల్యాగ్ అనిపించినా.. సినిమాలో తర్వాత వచ్చే ఎలివేషన్ సీన్స్ తో ప్రేక్షకులను ఆ సంగతి మరిచిపోయేలా చేసాడు. దేవీశ్రీ ప్రసాద్ అందించిన పాటలు బాగున్నాయి. రీ రికార్డింగ్ అదిరిపోయింది. ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించడం ఖాయం. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ అక్కడక్కడ తన కత్తెరకు పని చెబితే బాగుండేది. ముఖ్యంగా అల్లు అర్జున్, రష్మికల మధ్య కొన్ని సీన్స్ ప్రేక్షకులకు కాస్త ఇబ్బంది పెట్టినట్టు అనిపిస్తున్నాయి. 20 నిమిషాలు ట్రిమ్ చేసినా..పెద్దగా వచ్చిన ఇబ్బంది ఏమి లేదు. ముఖ్యంగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి.
నటీనటుల విషయానికొస్తే..
పుష్ప అంటే ఫ్లవర్ అనుకొంటివా.. ఫైర్ అంటూ ఏకంగా జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నాడు అల్లు అర్జున్. తెలుగు నుంచి ఈ ఘనత అందుకున్న హీరోగా రికార్డు క్రియేట్ చేసాడు. ఇపుడు పుష్ప 2 ది రూల్ లో తన యాక్టింగ్ లో ఎక్కడా తగ్గేదేలే అంటూ తన నటనలో వైల్డ్ ఫైర్ చూపించారు. సాధారణంగా ఏ నటుడికి బాల్యం నుంచి ముసలితనం వచ్చే వరకు వచ్చే వేషాలు చాలా అరుదుగా వస్తుంటాయి. ఇపుడు పుష్ప పార్ట్ 1లో హీరో అతని ఎదుగుదల వుంటుంది. పుష్ప 2లో మరో లెవల్ చూపించారు. ప్రజల కోసం కుటుంబం కోసం ఏం చేయడానికైనా వెనకాడని పుష్ప రాజ్ పాత్రలో మరోసారి మెప్పించాడు. ఈ సినిమాలో నటనకు మరోసారి జాతీయ అవార్డు వచ్చినా ఆశ్యర్యపోవాల్సిన పనిలేదు. హీరోయిన్ గా నటించిన రష్మిక కూడా తన యాక్టింగ్ తో మరోసారి మెస్మరైజ్ చేసింది. శ్రీవల్లి పాత్రలో ఒదిగిపోయింది. ఒక ఇల్లాలి పాత్రలో మెప్పించింది. భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో నటించిన ఫహద్ ఫాజిల్ మరోసారి తన యాక్టింగ్ మెప్పించాడు. అల్లు అర్జున్ తో పోటీ పడి మరి నటించాడు. మంగళం శ్రీను సునీల్, దాక్షయాణి పాత్రలో అనసూయ పర్వాలేదు. జగపతి బాబు, రావు రమేష్ ఇతర నటీనటులు తమ పరిధి మేరకు మెప్పించారు.
ప్లస్ పాయింట్స్
అల్లు అర్జున్, ఫహద్ ఫాజిల్ నటన
సుకుమార్ టేకింగ్
దేవీశ్రీ సంగీతం
నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్స్
సినిమా నిడివి
లాజిక్ లేని సీన్స్
పంచ్ లైన్..పుష్ప 2 ది రూల్.. వైల్డ్ ఫైర్ ఎక్కడా.. తగ్గదేలే..
రేటింగ్ : 3.5/5
ఇదీ చదవండి: ముగ్గురు మొనగాళ్లు సినిమాలో చిరంజీవి డూప్ గా నటించింది వీళ్లా.. ఫ్యూజలు ఎగిరిపోవడం పక్కా..
ఇదీ చదవండి: టాలీవుడ్ లో ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రాలు.. ‘పుష్ప 2’ ప్లేస్ ఎక్కడంటే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.