Pushpa, Akhanda and Pelli Sandadi Movies to release on OTT: కరోనా వైరస్  మహమ్మారి ప్రభావం తెలుగు సినిమా ఇండస్ట్రీ (Tollywood)పై బాగానే పడింది. సెకండ్ వేవ్ కారణంగా 2021లో చాలా రోజులు థియేటర్లు తెరుచుకోలేదు. అదే సమయంలో సినిమాల షూటింగ్ కూడా ఆగిపోయింది. ఎట్టకేలకు వైరస్ తగ్గుముఖం పట్టడంతో థియేటర్లు ఓపెన్ కాగా.. కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి. పెళ్లి సందడి, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ (Most Eligible Bachelor), అఖండ, పుష్ప వంటి సినిమాలు గత సంవత్సరం విడుదల అయి విజయాలు అందుకున్నాయి. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ కాగా.. పెళ్లి సందడి, అఖండ, పుష్ప సినిమాలు విడుదల కోసం సిద్ధంగా ఉన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పెళ్లి సందడి (Pelli Sandadi), అఖండ, పుష్ప సినిమాలు జనవరి నెలలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయి. అఖండ (Akhanda) హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుండగా.. పుష్ప అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుందని సమాచారం తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం డిసెంబర్ 17న విడుదల అయిన పుష్ప (Pushpa) సినిమా జనవరి 14న ఓటీటీలో విడుదల కానుందట. చిత్ర యూనిట్ నుంచి మాత్రం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు. అయితే డేట్ ముందే అనౌన్స్  చేస్తే.. బాక్స్ ఆఫీస్ కలెక్షన్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని మేకర్స్ భావిస్తున్నారట. ఇక అఖండ, పెళ్లి సందడి విడుదల తేదీలు తెలియరాలేదు. సంక్రాంతి కానుకగా ఈ రెండు సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. ఈ మూడు సినిమాలు కొత్త స్ట్రీమింగ్ రికార్డులను సృష్టిస్తాయని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 


Also Read: Brett Lee: కుమారుడిపై కూడా కనికరం చూపని బ్రెట్‌ లీ.. మిడిల్ స్టంప్ ఎగిరిపోయింది (వీడియో)!!


నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna) ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ సినిమా అఖండ. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా.. జగపతిబాబు, శ్రీకాంత్‌, పూర్ణ కీలక పాత్రలో నటించారు. భారీ అంచనాల మధ్య డిసెంబర్ 2న విడుదలైన అఖండ.. మంచి వసూళ్లను రాబడుతోంది. అంచనాలను మించి దుమ్ము లేపుతోంది. అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమా డిసెంబర్ 17న విడులై.. అద్భుత కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. 13 రోజుల్లో కలిపి ప్రపంచవ్యాప్తంగా 138.72 కోట్ల నెట్, 244 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. శ్రీకాంత్ తనయుడు రోష‌న్ (Roshan), శ్రీ‌లీల హీరోహీరోయిన్లుగా నటించిన పెళ్లి సందడి కూడా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. 


Also read: RRR Postponed: ఆర్ఆర్ఆర్ మూవీ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. ఒమిక్రాన్ ధాటికి రిలీజ్ వాయిదా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి