Pushpa Movie: భారీ అంచనాలతో విడుదలై..బాక్సాఫీసు వద్ద దూసుకుపోతున్న సినిమా పుష్ప ది రైజ్. పుష్ప సినిమా గురించి ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించిన దర్శకుడు సుకుమార్..అల్లు అర్జున్ గురించి సంచలన విషయాలు వెల్లడించాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో మెగా బ్లాక్‌బస్టర్ మూవీ పుష్ప (Pushpa). ఆర్య, ఆర్య 2 తరువాత తిరిగి బన్నీతో లెక్కల మాస్టారు సుకుమార్ తెరకెక్కించిన సినిమా ఇది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపధ్యంగా సాగే సినిమాలో అల్లు అర్జున్ పక్కా ఊరమాస్ అనేకంటే పాత్రకు తగ్గ వేషంలో కన్పించాడు. పూర్తిగా హీరో ఆధిపత్యంగా సాగే సినిమా ఇది. డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదలైన ఈ పాన్ ఇండియా సినిమా బాక్సాఫీసుల వద్ద భారీగా కలెక్షన్లు రాబడుతోంది. అల్లు అర్జున్ యాక్టింగ్, యాక్షన్ సన్నివేశాలు, పాటలు సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. ఇప్పుడీ సినిమా గురించి..ముఖ్యంగా అల్లు అర్దున్ గురించి కొన్ని ఆసక్తికరమైన, సంచలనమైన విషయాల్ని సుకుమార్ వెల్లడించాడు.


పుష్ప సినిమాలో క్లైమాక్స్ సీన్ అల్లు అర్జున్ (Allu Arjun)-పోలీసు అధికారి ఫహద్ ఫాసిల్ మధ్య ఉంటుంది. ఈ క్రైమాక్స్ సీన్‌లో అటు ఫహద్ ఫాసిల్ ఇటు అల్లు అర్జున్ ఇద్దరూ కేవలం అండర్‌వేర్‌లో మాత్రమే కన్పిస్తారు. సరిగ్గా ఈ సీన్ గురించే సుకుమార్ ఆసక్తికర విషయాల్ని తెలిపాడు. ఈ సీన్‌లో బన్నీ , ఫహద్ ఫాసిల్ ఇద్దరూ బట్టలు దాదాపుగా విప్పేస్తారు. కేవలం అండర్‌వేర్‌తో మిగులుతారు. వాస్తవానికి ఈ సీన్‌లో అల్లు అర్జున్ సహా ఇద్దరనీ నగ్నంగా చూపించాలనుకున్నాడట సుకుమార్. అయితే తెలుగు ప్రేక్షకులు అంగీకరించరని తెలిసి..అప్పటికప్పుడు మార్పులు చేసినట్టు సుకుమార్ ( Sukumar)చెప్పుకొచ్చాడు. అదే సమయంలో పార్ట్ 2 లో చాలా ఆసక్తికరమైన సన్నివేశాలుంటాయన్నాడు. మొదటి భాగంలో కేవలం పాత్రల్ని మాత్రమే పరిచయం చేశామని..అసలు కధ రెండవ భాగంలో ఉంటుందన్నాడు. 


Also read: Anushka and Naveen Polishetty: అనుష్కతో ఖరారైన నవీన్ పోలిశెట్టి అప్‌కమింగ్ మూవీ, కధ ఏంటో తెలుసా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి